Pawan Kalyan : పవన్ బర్త్ డేకి రెడీ అవుతున్న గిఫ్ట్స్.. ఏ సినిమా నుంచి ఏ అప్డేట్..?

పవన్ కళ్యాణ్ బర్త్ డేకి నిర్మాతలు గిఫ్ట్స్ రెడీ చేస్తున్నారు. ఈక్రమంలోనే OG, ఉస్తాద్, వీరమల్లు నుంచి..

OG Ustaad Bhagat Singh Hari Hara Veera Mallu updates on Pawan Kalyan birthday

Pawan Kalyan : రేపు సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో.. ప్రస్తుతం నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ రెడీ అవుతున్నాయి. పవన్ అభిమానులకు అదిరిపోయే బహుమతులు ఇచ్చేందుకు మేకర్స్ సూపర్ అప్డేట్స్ రెడీ చేస్తున్నారు. పవన్ చేతిలో ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రాలు ఉన్నాయి. కాగా ముందుగా OG మూవీ నుంచి అప్డేట్ రానుంది. రేపు ఉదయం 10:35 గంటలకు టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.

Varun – Lavanya : జిమ్‌లో వరుణ్, లావణ్య వర్క్ అవుట్స్.. పిక్ వైరల్!

సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పవన్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. దీంతో ఈ టీజర్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దీని తరువాత హరిహరవీరమల్లు నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ కానుంది. ఉదయం 12:17 గంటలకు ఈ పోస్టర్ రిలీజ్ అవుతుంది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ వారియర్ రోల్ లో కనిపించబోతున్నాడు. హిస్టారికల్ మూవీ కావడంతో షూటింగ్ బాగా లేట్ అవుతూ వస్తుంది. OG, ఉస్తాద్ షూటింగ్స్ పూర్తిగా కంప్లీట్ అయిన తరువాతే పవన్.. వీరమల్లుని సెట్స్ లోకి అడుగుపెట్టనున్నాడు.

Sapthami Gowda : తమ్ముడు సినిమాలో నితిన్‌కి జోడిగా కాంతార భామ సప్తమి..

ఇక ఉస్తాద్ విషయానికి వస్తే.. అప్డేట్ రాబోతుంది అని దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు తప్ప, అది ఏంటిది..? ఎప్పుడు వస్తుందని అనేది..? తెలియజేయలేదు. గబ్బర్ సింగ్ వంటి హిట్ తరువాత పవన్ అండ్ హరీష్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో మంచి హైపే ఉంది. ఇప్పటికి ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఈ వారంలో సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది. ఒక ప్రత్యేక సెట్ లో సినిమాలోని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఇక రేపు ఈ మూడు సినిమాల అప్డేట్స్ తో కొత్త ప్రాజెక్ట్స్ అప్డేట్స్ కూడా ఏమన్నా తెలుస్తాయా? అనేది చూడాలి.