Sapthami Gowda : తమ్ముడు సినిమాలో నితిన్‌కి జోడిగా కాంతార భామ సప్తమి..
నితిన్ కొత్త మూవీ తమ్ముడుతో కాంతార భామ సప్తమి గౌడ.. హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందా..?

Kantara fame Sapthami Gowda is heroine for Nithiin Thammudu
Sapthami Gowda : ఇటీవల కాంతార (Kantara) సినిమాతో సూపర్ ఫేమ్ ని సంపాదించుకున్న కన్నడ హీరోయిన్ ‘సప్తమి గౌడ’. తెలుగులో కూడా ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో సప్తమికి ఇక్కడ కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక సోషల్ మీడియాలో చీర సోయగాలతో ఈ అమ్మడు పెట్టే ఫోటోలకు నెటిజెన్స్ ఫిదా అవుతుంటారు. దీంతో యూత్ లో సప్తమికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ ఫేమ్ తెలుగులో కూడా అమ్మడికి ఆఫర్లు తెచ్చిపెడుతుంది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) కొత్త సినిమాలో ఈ భామ ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం.
Gautam Ghattamaneni : బర్త్ డేని గొప్పగా జరుపుకున్న గౌతమ్.. హ్యాట్సాఫ్ అంటున్న అభిమానులు..
ఇటీవల నితిన్ దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం తమ్ముడు (Thammudu) అనే టైటిల్ ని పెట్టారు. పవన్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ (Vakeel Saab) ని డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈక్రమంలోనే హీరోయిన్ గా సప్తమిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోషూట్ కూడా జరిగినట్లు సమాచారం.
Pawan Kalyan : అభిమానులందు పవన్ అభిమానులు వేరయా.. 470 కేజీల వెండితో..
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుందట. అందుకనే ఆ రోల్ కి సప్తమి అయితే న్యాయం చేయగలదని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపు సప్తమి ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేసినట్లు ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. అలాగే మూవీలో మరికొన్ని ప్రధాన పాత్రల్లో కూడా స్టార్ క్యాస్ట్ కనిపించబోతుందని చెబుతున్నారు. కాగా నితిన్ ప్రస్తుతం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man), వెంకీ కుడుముల సినిమాలు చేస్తున్నాడు.