Gautam Ghattamaneni : బర్త్ డేని గొప్పగా జరుపుకున్న గౌతమ్.. హ్యాట్సాఫ్ అంటున్న అభిమానులు..
తన పుట్టినరోజు నాడు మహేష్ తనయుడు గౌతమ్ చేసిన పనికి అభిమానులు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇంతకీ ఏం చేశాడు..?

Gautam Ghattamaneni distribute hearing aids and sports kits to Burripalem children
Gautam Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తనయుడు గౌతమ్ పుట్టినరోజు నిన్న ఆగష్టు 31న జరిగింది. ఈ ఏడాదితో గౌతమ్ 17వ ఏటలోకి అడుగు పెట్టాడు. ఇక బర్త్ డే సందర్భంగా తన ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి మహేష్ అభిమానులు నుంచి గౌతమ్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక ఈ బర్త్ డేని గౌతమ్ కూడా చాలా గొప్పగా జరుపుకున్నాడు. మహేష్ బాబు ఫౌండేషన్ లో సేవ కార్యక్రమం నిర్వహించి.. తన తండ్రి లాగానే తన గొప్ప మనసుని చాటుకున్నాడు.
Pawan Kalyan : అభిమానులందు పవన్ అభిమానులు వేరయా.. 470 కేజీల వెండితో..
తన తండ్రి సొంత గ్రామం అయిన బుర్రిపాలెంలోని పిల్లలను కలుసుకొని వారి మధ్య పుట్టినరోజు వేడుకను జరుపుకున్నాడు. వారి మధ్య కేక్ కట్ చేసి బర్త్ డేని సంతోషంగా జరుపుకున్న గౌతమ్.. అనంతరం వారికీ స్పోర్ట్స్ కిట్స్ ని గిఫ్ట్స్ గా ఇచ్చాడు. అలాగే వినికిడి సమస్యతో బాధపడుతున్న కొంతమంది విద్యార్థులకు హియరింగ్ మెషిన్ కూడా అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని గౌతమ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. తన బర్త్ డే ఇలా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ పేర్కొన్నాడు.
Gautam Ghattamaneni : గౌతమ్‌కి మహేష్, నమ్రతా, సితార బర్త్ డే విషెస్.. పోస్టులు వైరల్!
View this post on Instagram
కాగా ఇటీవల MB ఫౌండేషన్ ద్వారా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పిల్లలని కూడా కలుసుకొని వాళ్ళకి కూడా బహుమతులు అందించి, వారిలో ధైర్యాన్ని నింపుతూ వాళ్ళతో కొత్త సమయం గడపడం కూడా అందరి చేత అభినందనలు అందుకునేలా చేసింది. ఇక ఇప్పుడు ఈ పోస్టు చూసిన మహేష్ అభిమానులు.. చిన్న వయసులోనే గౌతమ్ చేస్తున్న పనులకు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక గౌతమ్ చెల్లెలు సితార (Sitara) కూడా తన బర్త్ డేని ఇలానే చేసుకుంది. పేద విద్యార్థులకు సైకిళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి తండ్రి బాటలోనే తాను కూడా అని చెప్పింది.