చాణక్య : బ్యూటిఫుల్ మెలోడి
మ్యాచో స్టార్ గోపిచంద్, మెహరీన్ జంటగా, తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న 'చాణక్య'.. నుండి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల..

మ్యాచో స్టార్ గోపిచంద్, మెహరీన్ జంటగా, తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘చాణక్య’.. నుండి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల..
మ్యాచో స్టార్ గోపిచంద్, మెహరీన్ జంటగా, తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమా.. ‘చాణక్య’.. గోపిచంద్ 26వ సినిమా ఇది. స్పై థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపిచంద్, అర్జున్ అనే రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది.
రీసెంట్‌గా చాణక్య నుండి బ్యూటిఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘గుండెల్లో శ్వాసగా.. కనుపాపల్లో ఆశగా నువ్వుంటే చాలురా కలకాలం.. ఓ మైలవ్’ అంటూ సాగే ఈ పాట కూల్‌గా వినసొంపుగా ఉంది. శ్రీ చరణ్ పాకాల కంపోజ్ చేసిన ట్యూన్‌కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా.. చిన్మయి, పూజాన్ కోహ్లీ చక్కగా పాడారు.
చాణక్య దసరా కానుకగా విడుదల కానుంది. కెమెరా : వెట్రి, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : విశాల్ చంద్రశేఖర్, మాటలు : అబ్బూరి రవి, సమర్పణ : ATV, నిర్మాత : రామబ్రహ్మం సుంకర.