Oka Parvathi Iddaru Devadasulu
Oka Parvathi Iddaru Devadasulu : పార్వతి దేవదాసుల ప్రేమ కథకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సారి ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు అనే సరికొత్త టైటిల్ తో ఓ విభిన్నమైన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాహిష్మతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై తోట రామకృష్ణ దర్శక నిర్మాతగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా రాశీ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా రఘు బాబు, కసిరెడ్డి రాజ్ కుమార్, వీర శంకర్, గౌతంరాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రజిత.. పలువురు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది.
Also Read : Coolie : రజినీకాంత్ – నాగార్జున ‘కూలీ’ మూవీ రివ్యూ.. నాగార్జున విలన్ గా చేసిన సినిమా..
తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఇది కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. యువతను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండబోతుందని దర్శక నిర్మాత తోట రామకృష్ణ తెలియజేశారు.