Site icon 10TV Telugu

Oke Oka Jeevitham: తన సినిమా టికెట్లు తనకే దొరకలేదని అంటోన్న ‘ఒకే ఒక జీవితం’ డైరెక్టర్!

Oke Oka Jeevitham Director Does Not Get Tickets For His Own Movie

Oke Oka Jeevitham Director Does Not Get Tickets For His Own Movie

Oke Oka Jeevitham: యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ గత శుక్రవారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకార్తిక్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. అమ్మ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతుండటంతో ఈ సినిమా చాలా ఏరియాల్లో హౌజ్‌ఫుల్ షోలతో దూసుకెళ్తోంది. అయితే ఈ చిత్ర దర్శకుడు శ్రీకార్తిక్‌కు తాజాగా ఓ విచిత్ర ఘటన ఎదురయ్యింది.

Oke Oka Jeevitham: సెన్సార్ పనులు ముగించుకున్న ఒకే ఒక జీవితం

‘ఒకే ఒక జీవితం’ సినిమాకు పబ్లిక్ మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండటంతో ఈ సినిమాకు హౌజ్‌ఫుల్ బోర్డులు పడుతున్నాయనే విషయం తెలుసుకున్న ఈ చిత్ర డైరెక్టర్ శ్రీకార్తిక్.. సినిమా రిలీజ్ అయిన మూడో రోజున ఈ సినిమాను చూసేందుకు ఓ థియేటర్‌కు వెళ్లాడు. అయితే అతడికి టికెట్ బుకింగ్ కౌంటర్లో ‘నో టికెట్స్’ అనే రెస్పాన్స్ దక్కడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు ఈ డైరెక్టర్. తన సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ దక్కడం చాలా హ్యాపీగా ఉందని ఈ డైరెక్టర్ అంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Hero Sharwanand Speech At Oke Oka Jeevitham Pre Release Event

ఎమోషనల్ కంటెంట్‌కు టైమ్ ట్రావెల్ వంటి సైన్స్ ఫిక్షన్ అంశాన్ని జోడించి ఈ సినిమాను శ్రీకార్తిక్ మలిచిన తీరు చాలా బాగుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ సినిమాతో శర్వానంద్ ఎంతగానో వెయిట్ చేస్తున్న హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రీతూ వర్మలు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, శర్వా తల్లిగా నటి అమల అక్కినేని చాలా గ్యాప్ తరువాత మళ్లీ సినిమాల్లో కనిపించడం ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, డ్రీమ్స్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది.

Exit mobile version