Oke Oka Jeevitham Gets Average TRP On First Time TV World Premiere
Oke Oka Jeevitham: యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లో 30వ చిత్రంగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకార్తిక్ డైరెక్ట్ చేయగా, పూర్తి ఫీల్‌గుడ్ కంటెంట్‌తో ఈ సినిమాను రూపొందించారు. తల్లి సెంటిమెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక శర్వానంద్ యాక్టింగ్ ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా నిలిచింది.
Oke Oka Jeevitham: ఓటీటీలో ఎంట్రీ ఇస్తోన్న ఒకే ఒక జీవితం
ఇక ఈ సినిమాలో అమలా అక్కినేని చాలా రోజుల తరువాత స్క్రీన్ ప్రెసెన్స్ ఇచ్చారు. ఆమె పాత్ర ఈ సినిమాకు బలాన్ని ఇచ్చింది. ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కమర్షియల్ పరంగా ఈ సినిమా హిట్ కావడంతో శర్వా అండ్ టీమ్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, తాజాగా ఈ సినిమాను బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేశారు. ప్రముఖ ఛానల్ జెమిని టీవీలో ఈ సినిమాను టెలికాస్ట్ చేయగా, దీనికి 2.08 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
Oke Oka Jeevitham: ‘ఒకే ఒక జీవితం’పై నేచురల్ స్టార్ నాని కామెంట్స్.. ఏమన్నాడంటే..?
ఒక చిన్న బడ్జెట్ సినిమాకు ఈ స్థాయి టీఆర్పీ రేటింగ్ రావడం విశేషమని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, అందాల భామ రీతూ వర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.