Oke Oka Jeevitham Trailer Creates Curiosity In Audiences
Oke Oka Jeevitham: యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను సై-ఫై డ్రామాగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
Oke Oka Jeevitham Trailer: ‘ఒకే ఒక జీవితం’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!
కొత్త దర్శకుడు శ్రీకార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ చిత్ర ట్రైలర్ విషయానికి వస్తే.. మ్యూజిక్ కంపోజర్ అవ్వాలనే శర్వా, తన స్నేహితులు ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌లతో కలిసి నాజర్‌ను కలుస్తారు. గతంలోకి వెళ్లే యంత్రాన్ని కనిపెట్టిన నాజర్ సాయంతో, శర్వా అతడి ఫ్రెండ్స్ కలిసి గతంలోకి వెళ్తారు. తమ చిన్నతనంలో జరిగిన కొన్ని ఘటనలను వారు సరిచేసి, భవిష్యత్తును మార్చాలని చూస్తారు.
Oke Oka Jeevitham: ఒకే ఒక జీవితం.. వచ్చేది అప్పుడే!
మరి ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మనం థియేటర్లలోనే చూడాలి అంటున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో అందాల భామ రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. కాగా, ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో శర్వానంద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.