Om Raut: ఆదిపురుష్ తరువాత శక్తిమాన్ అంటోన్న డైరెక్టర్..?

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ కు కొత్తగా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. బాలీవుడ్ లో ‘తాన్హాజీ’ చిత్రంతో పాపులర్ అయిన ఈ డైరెక్టర్ ఇప్పుడు ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్....

Om Raut To Direct Shaktimaan After Adipurush

Om Raut: బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ కు కొత్తగా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. బాలీవుడ్ లో ‘తాన్హాజీ’ చిత్రంతో పాపులర్ అయిన ఈ డైరెక్టర్ ఇప్పుడు ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఆదిపురుష్ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసి ఇప్పటికే షూటింగ్ పనులు కూడా ముగించాడు ఈ డైరెక్టర్. ఇక ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలుసా!

అయితే ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఓం రావుత్ ఆదిపురుష్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఈ డైరెక్టర్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. 90ల కాలంలో చిన్నపిల్లలతో పాటు పెద్దలను అమితంగా ఆకట్టుకున్న ఇండియన్ సూపర్ హీరో సీరియల్ ‘శక్తిమాన్’ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సీరియల్ ను ఇప్పుడు వెండితెరపై చూపెట్టేందుకు ఈ డైరెక్టర్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

Adipurush: విజువల్ పనుల్లో ఆదిపురుష్.. 3డీ కోసం ఫుల్ ఎఫర్ట్!

ఆదిపురుష్ సినిమా తరువాత శక్తిమాన్ సినిమాను అత్యంత భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కించేందుకు ఓం రావుత్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బుల్లితెరపై రఫ్ఫాడించిన శక్తిమాన్, వెండితెరపై ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటాడో, అసలు ఈ డైరెక్టర్ ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.