హీరో రామ్ రీసెంట్ గా పూరి జగన్ దర్శకత్వంలో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ 18వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమా కోసం జిమ్ లో రామ్ చేసే వర్కవుట్స్ మామూలుగా లేవు. దాదాపు 450 కిలోల బరువును లెగ్స్ తో లిఫ్ట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని రామ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గతంలో రామ్, కిశోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ మూవీలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు లవ్ స్టోరీలే కావడంతో ఈ సారి అలా కాకుండా.. మంచి క్రైమ్ నేపథ్యంలో సినిమా తీయబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమా తమిళ రీమేక్ గా రూపొందనున్నట్లు సమాచారం. ఈ సినిమా దసరాకి ప్రారంభం కానుందట.
1000 Pound Leg Press..
It’s not what They can See..
It’s what You can Be..Love..
– #RAPO #RAndoMthoughts #RAPO18 pic.twitter.com/JLIf7YMe3V— Ustaad iSmart Shankar (@ramsayz) October 1, 2019