Jr NTR: పాలిటిక్స్‌పై జూనియర్ ఎన్టీఆర్ అందుకే అలా అన్నారా?

ఇప్పుడు మరోసారి తన పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశాడు ఎన్టీఆర్.

మ్యాన్‌ ఆఫ్‌ది మాసెస్.. అతడే జూనియర్ ఎన్టీఆర్. సినిమా గురించి చర్చ వచ్చినా ..టీడీపీ ఫ్యూచర్ పాలిటిక్స్‌పై చర్చ జరిగినా ఆయన హాట్ టాపిక్‌గా ఉంటారు. ఇప్పుడు కాకపోయినా ఇంకో నాలుగేళ్లకైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారంటూ ఎప్పటినుంచో ఊహాగానాలు ఉన్నాయి. దేవర మాత్రం ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తున్నాడు.

సినిమానే తన ప్రయారిటీ అంటున్నారు. అయినా ఊహాగానాలకు తెరపడటం లేదు. ఇప్పుడు మరోసారి తన పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశాడు ఎన్టీఆర్. హిందీలో గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అందులో కపిల్ శర్మ ఎన్టీఆర్‌ను ఇంట్రెస్టింగ్‌ క్వశ్చన్ అడిగారు. దానికి ఎన్టీఆర్ కూడా ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చాడు.

అభిమానుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే అవకాశాల్లేవా అని కపిల్ శర్మ అడగ్గా.. బాక్సాఫీస్‌కు టికెట్‌ బ్యాంక్‌గా మార్చుకుంటానని ఎన్టీఆర్ సూటిగా సమాధానం ఇచ్చాడు. తన ఫ్యాన్స్ తన కోసం టికెట్స్ కొనుక్కునే వరకు చాలని అంతకు మించి ఇంకేమి వద్దంటూ చెప్పుకొచ్చాడు. తాను సినిమాల్లో ఇంకా ఎంతో చోయాల్సి ఉందన్నాడు ఎన్టీఆర్.

చాలా కాలంగా ఎన్టీఆర్ ఇదే చెబుతున్నాడు. ఆయన ఇప్పుడు నేషనల్ రేంజ్‌కు వెళ్లాడు. హృతిక్‌తో వార్ టు చేస్తున్నాడు. ఆయన స్పష్టమైన హిందీతో పాటు నార్త్ ప్రజల్ని ఆకట్టుకునే ప్రజెన్స్ ఉండటంతో బాలీవుడ్ లోనూ దేవర జెండా పాతుతాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో డైవర్ట్ కాకుండా..పొలిటికల్ నీడ తన మీద పడకుండా చూసుకుంటున్నాడు ఎన్టీఆర్. 2009లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

ఎన్టీఆర్ ఇప్పటికీ నందమూరి ఫ్యామిలీకి, నారా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు. వాళ్ళు దూరం ఉంచుతున్నారా లేక ఎన్టీఆరే దూరం ఉంటున్నాడా అనేది క్లారిటీ లేదు. దానికి కారణం పెద్ద ఎన్టీఆర్ తర్వాత జూనీయర్ ఎన్టీఆర్ టీడీపీ నాయకుడవుతాడని ఎన్నో చర్చలు ఉన్నాయి. దీంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీస్‌కు దూరం అయ్యారన్న ప్రచారం కూడా ఉంది.

అయితే దేవర సినిమా రిలీజ్‌కు ఏపీలో టికెట్ రేట్లు పెంచడం, అదనపు షోలు పెంచి ఏపీ ప్రభుత్వం పుల్ సపోర్ట్ ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీలకు దగ్గర అయ్యాడని అనుకుంటున్న టైంలో పాలిటిక్స్‌పై ఎన్టీఆర్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక తమ హీరో పాలిటిక్స్‌కు దూరంగా..ఫ్యామిలీస్‌కు దగ్గర అవుతున్నారంటున్నారు ఫ్యాన్స్.

ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌ చుట్టూ రాజకీయం.. ఎందుకంటే?