Oscar Awards: మరోసారి వార్తల్లో నిలిచిన విల్ స్మిత్ – క్రిస్ రాక్ చెంపదెబ్బ రచ్చ

94వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో హాలీవుడ్ అగ్ర కధానాయకుడు విల్ స్మిత్ ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్‌ని‌ చెంపదెబ్బ కొట్టడం మనందరకీ తెలిసిందే. 2022 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి క్రిస్ రాక్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

Once again Will Smith Chris Rock Oscar Awards Issue is on News

Oscar Awards: 94వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో హాలీవుడ్ అగ్ర కధానాయకుడు విల్ స్మిత్ ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్‌ని‌ చెంపదెబ్బ కొట్టడం మనందరకీ తెలిసిందే. 2022 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి క్రిస్ రాక్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అందులో భాగంగా క్రిస్ రాక్ ఒక కామెడీ ట్రాక్ ని చెబుతూ విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ప్రస్తావన తీసుకువచ్చాడు.

Oscar Awards : చెంపదెబ్బ ఘటన.. విల్‌స్మిత్ ఆస్కార్ వెనక్కి తీసుకుంటారా??

ఆమె అలోపేసియా అనే అనారోగ్య సమ్యస్యకు గురికావడంతో ఆమె పూర్తిగా జుట్టు లేకుండా గుండుతో కనిపించింది. అది చూసిన క్రిస్ రాక్ ఆమెను ‘జీ.ఐ.జేన్’ చిత్రంలో ‘డెమి మూర్’ పోషించినపాత్రతో పోల్చాడు. అది సహించలేని విల్ స్మిత్ వేదికపైకి వెళ్ళిమరీ అందరిముందు క్రిస్ రాక్ చెంప పగలకొట్టాడు. ఆ తరువాత విల్ స్మిత్ అకాడమీకి, క్రిస్ రాక్ కి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కూడా చెప్పిన విషయం తెలిసిందే.

Oscar Awards : ఆస్కార్ వేడుకల్లో ఊహించని సంఘటన.. కమెడియన్‌ని కొట్టిన బెస్ట్ యాక్టర్ విల్‌స్మిత్

అయితే 2023 ఆస్కార్ అవార్డులకు గాను క్రిస్ రాక్ ని తిరిగి వ్యాఖ్యాతగా వ్యవహరించమని ఆఫర్ వచ్చిందట. దీనిపై క్రిస్ రాక్ ఆరిజోనాలోని ఒక కామెడీ సెట్లో మాట్లాడుతూ.. ఇంకోసారి ఆస్కార్ వేడుకులకు వెళ్ళడాన్ని నేరం జరిగిన ప్రాంతానికి తిరిగి వెళ్ళడంగా పోల్చుతూ స్పందించారు అని ఆరిజోనా రిపబ్లిక్ వెల్లడించింది. అలాగే స్మిత్ గురించి మాట్లాడుతూ.. ఆయన నాకంటే పెద్దవాడు, మా ఇద్దరి మధ్య ఇలాంటి తరహా పోరాటానికి మరోసారి ఆ ప్రాంతం అనుమతించదు అంటూ వ్యాఖ్యానించారు.