Oopiri Ooyalaga Song out now from WAR 2 movie
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కియారా అడ్వాణీ కథానాయిక. యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో YRF సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో తాజాగా ఈ చిత్రం నుంచి సర్‌ప్రైజ్ వచ్చింది. రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. “ఊపిరి ఊయలగా” అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. శశ్వాంత్ సింగ్, నిఖితా పాడారు. ఈ పాటలో హృతిక్, కియారాల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.
Kingdom : ‘కింగ్డమ్’ మూవీ రివ్యూ.. అన్న కోసం తమ్ముడు మొత్తం తగలపెట్టేశాడా?
ఆగస్టు 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.