అక్టోబర్ 5న ఊరంతా అనుకుంటున్నారు!

నవీన్ విజయ్ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. 'ఊరంతా అనుకుంటున్నారు'.. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల..

  • Published By: sekhar ,Published On : September 24, 2019 / 10:23 AM IST
అక్టోబర్ 5న ఊరంతా అనుకుంటున్నారు!

Updated On : September 24, 2019 / 10:23 AM IST

నవీన్ విజయ్ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఊరంతా అనుకుంటున్నారు’.. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల..

నందిని నర్సింగ్ హోమ్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నవీన్ విజయ్ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్ ప్రధాన తారాగణంగా.. బాలాజీ సానల దర్శకత్వంలో, రోవాస్కైర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై.. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి, ఎ.పద్మనాభ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఊరంతా అనుకుంటున్నారు’..
ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మూవీ చూసిన సెన్సార్ టీమ్ క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

Read Also : ఇస్మార్ట్ శంకర్ టైటిల్ ట్రాక్ – వీడియో సాంగ్ రిలీజ్..

మా `ఊరంతా అనుకుంటున్నారు` చిత్రం విందు భోజ‌నంలాంటి సినిమా. సినిమా చూసిన ప్రేక్ష‌కుల‌ు మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చూశామ‌ని గ్యారంటీగా ఫీల్ అవుతారు. కె.ఎమ్.రాధాకృష్ణ‌ గారి అద్భుత‌మైన సంగీతం, జి.ఎల్‌.ఎన్‌.బాబు బ్యూటిఫుల్ విజువ‌ల్స్‌, సున్నితమైన ఫ్యామిలీ కామెడీతో పాటు జయసుధ, రావు రమేష్‌ల మధ్య, నవీన్ విజయకృష్ణ, శ్రీనివాస్ అవసరాల మధ్య వచ్చే సీన్స్ భావోద్వేగాన్ని కలిగించేలా దర్శకుడు బాలాజీ సానల చిత్రీకరించారు. ఈ పండ‌గలాంటి సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేస్తున్నాం.. అని నిర్మాతలు అన్నారు.