తాజాగా టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరో మహేష్ బాబు అంటూ బాలీవుడ్‌కి చెందిన ఓ మీడియా సంస్థ ఒక లిస్ట్ విడుదల చేసింది. వారు నిర్వహించిన సర్వే ప్రకారం టాలీవుడ్ టాప్ 10 హీరోల లిస్ట్‌ను ఆ సంస్థ ప్రకటించింది. ఈ లిస్ట్‌లో హీరో మహేష్ బాబుకు నెంబర్ వన్ ప్లేస్ దక్కగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు 4వ స్థానం దక్కింది.
Ormax Media అనే సంస్థ టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ స్టార్ హీరోలపై సర్వే నిర్వహించిందట. ఈ సర్వే ప్రకారం ఒర్మాక్స్ విడుదల చేసిన టాప్ 10 హీరోల లిస్ట్ ఈ విధంగా ఉంది. 1. మహేష్ బాబు, 2. అల్లు అర్జున్, 3. ప్రభాస్, 4. పవన్ కల్యాణ్, 5. ఎన్టీఆర్, 6. చిరంజీవి, 7. రామ్ చరణ్, 8. నాని, 9. విజయ్ దేవరకొండ, 10. వెంకటేష్. హీరోకి దక్కిన విజయాలు.. అలాగే కలెక్షన్స్ ఆధారంగా ప్లేస్‌లు నిర్ణయించే ఈ సంస్థ.. 2020 మార్చి నెలకు సంబంధించి ఈ సర్వేను నిర్వహించిందట. మరి ఆ లెక్కన చూస్తే.. పవన్ కల్యాణ్‌కు 4వ ప్లేస్ ఎలా వచ్చిందో ఆ ఒర్మాక్స్ అనే సంస్థకే తెలియాలి. ఇంకా చెప్పాలంటే మార్చిలో సరిగా సినిమాలు విడుదల కాలేదు. సంక్రాంతికి విడుదలైన సినిమాలలో అల్లు అర్జున్ సినిమా కలెక్షన్ల పరంగా టాప్ ప్లేస్‌లో నిలిచింది. మరి అలాంటప్పుడు మహేష్ బాబు ఎలా నెంబర్ వన్ అవుతాడు అనేది నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్న. పవన్ కల్యాణ్ సినిమా చేసి 2 సంవత్సరాలు అవుతుంది. అలాంటిది ఆయనకున్న సక్సెస్, కలెక్షన్స్‌ని ఎలా లెక్కలోకి తీసుకున్నారో అని.. ఈ సంస్థపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టారు. పనిలో పనిగా టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ కూడా రిలీజ్ చేసిందీ సంస్థ.
Ormax Stars India Loves: We have started tracking star popularity of Hollywood, Tamil & Telugu stars, along with Hindi stars. The Top 10 lists for male & female stars will be posted here every month.
Top 10 male stars in Telugu cinema (March 2020) #OrmaxSIL #OSILTelugu pic.twitter.com/yDbZ92KFar
— Ormax Media (@OrmaxMedia) April 20, 2020