Oscar 2023 : ఆస్కార్.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పురస్కారమైన ఈ అవార్డుని అందుకోవడం జీవిత లక్ష్యంగా భావిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ నటులు మరియు సాంకేతిక నిపుణులు. ఈ విషయం అందరికి తెలుసు కానీ, ఈ అవార్డుని కొందరు ఆస్కార్ అని పిలుస్తారు. మరికొందరు అకాడమీ అవార్డు అని అంటారు. దీంతో కొంతమంది కన్‌ఫ్యూస్ అవుతుంటారు. మరి దీని వెనుకున్న కథ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయండి.
Oscar 2023 : ఆస్కార్ రెడ్ కార్పెట్ మార్చడానికి కారణం విల్ స్మిత్?
1927లో కాలిఫోర్నియాకి చెందిన ప్రముఖ మీడియా కంపెనీ అధిపతి ‘లూయిస్ బి మేయర్’ అనే వ్యక్తి.. సినిమా రంగాన్ని మరింత మెరుగుపరిచేలా ఒక సంస్థను సృష్టించాలనే ఆలోచనతో ప్రపంచంలోనే పలువురు సినీ ప్రముఖులను కలుపుకొని ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ అనే సంస్థని ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ప్రపంచంలోని ప్రతి సినిమా రంగంలోని ప్రతిభావంతులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా.. ఆ అవార్డు ప్రతిమని రూపొందించే భాద్యత కళాకారుడు సిడ్రిక్ గిబ్బన్స్ కి అప్పజెప్పారు.
Oscar 2023 : ఆస్కార్ అమ్ముకోవచ్చు తెలుసా.. అమ్మితే వచ్చే రేటు తెలిస్తే షాక్ అవుతారు!
ఇక సినిమా రంగంలోని ప్రధాన 5 విభాగాలు.. నిర్మాతలు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు, నటులను దృష్టిలో పెట్టుకొని 5 స్పోక్స్ (హోల్స్) ఉన్న ఒక ఫిల్మ్ రీల్ పై కత్తి పట్టుకొని ఒక వీరుడు నిలబడి ఉన్నట్లు అవార్డుని డిజైన్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న అవార్డు అదే. ఇక 1929 నుంచి ఈ అవార్డుల ప్రధానోత్సవం మొదలైంది. మొదటిలో ఈ అవార్డుని అకాడమీ అవార్డు అని పిలిచేవారు. కానీ 1939 లో అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్ అకాడమీ అవార్డుని చూసి.. అది తన మావయ్య ఆస్కార్ లా ఉంది అంటూ వ్యాఖ్యానించాడట. అప్పటి నుంచి కొంతమంది అకాడమీ అవార్డుని ఆస్కార్ అంటూ పిలవడం స్టార్ట్ చేశారు. కొన్నాళ్ళకు ఆస్కార్ అవార్డు పేరు బాగుండడంతో అదే పేరుని అధికారికంగా పిలవడం స్టార్ట్ చేశారు. ఇదే ఆస్కార్ అవార్డు వెనుక ఉన్న కథ.
Oscar award is called as Academy award why?