Oscars 2021 : ఆస్కార్ అవార్డులు.. ఇర్ఫాన్ ఖాన్, భాను అథియాలకు జ్ఞాపకార్థ నివాళి

93వ అకాడమీ అవార్డుల జ్ఞాపకార్థం విభాగంలో దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథియాలకు భారతీయ మొదటి ఆస్కార్ అవార్డు దక్కింది.

Oscars 2021 Irrfan Khan And Bhanu Athaiya Remembered In Tributes Montage

Oscars 2021 Tributes Montage : 93వ అకాడమీ అవార్డుల జ్ఞాపకార్థం విభాగంలో దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథియాలకు భారతీయ మొదటి ఆస్కార్ అవార్డు దక్కింది. 1982లో గాంధీ మూవీలో చేసిన కృషికిగానూ వీరికి మొదటి ఆస్కార్ అవార్డు దక్కింది. అంతర్జాతీయ సినిమాల్లో ప్రఖ్యాతి గాంచిన ఇర్ఫాన్ గత ఏడాదిలో 53ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మరణించారు. ఇర్ఫాన్ హాలీవుడ్ క్రెడిట్లలో ది నేమ్‌సేక్, లైఫ్ ఆఫ్ పై, స్లమ్‌డాగ్ మిలియనీర్ జురాసిక్ వరల్డ్ , పాన్ సింగ్ తోమర్, మక్బూల్, BAFTA- నామినేటెడ్ ది లంచ్ బాక్స్ వంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి.

గత ఏడాది ఇర్ఫాన్ మరణించగా.. అదే ఏడాదిలో భాను అతయ్య (91)ఏళ్లకు మరణించారు. భాను అథియా చేసిన సినిమాల్లో లగాన్, స్వడేస్, చాందినితో సహా అగ్నిపథ్ 100కి పైగా చిత్రాలలో పనిచేశారు. హాలీవుడ్ గ్రేట్ సీన్ కానరీ, చాడ్విక్ బోస్మాన్ ఉత్తమ నటుడిగా ఎంపిక అయ్యారు. BAFTAల నివాళి విభాగంలో కనిపించిన రిషి కపూర్, ఆస్కార్ ఇన్ మెమోరియంలో చోటు దక్కలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు కూడా లేకపోవడం గమనార్హం.


అత్యంత ప్రతిష్టాత్మక 93వ ఆస్కార్‌ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ప్రారంభమైంది.. కోవిడ్‌ కారణంగా మొదటిసారిగా రెండు ప్రాంతాల్లో అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఒకవైపు డోల్బీ థియేటర్‌లో, మరోవైపు లాస్‌ఏంజెల్స్‌లో ఆస్కార్‌ 2021 అవార్డు విజేతలను ప్రకటిస్తున్నారు. ప్రేక్షకులు లేకుండా కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

అవార్డుల విషయానికి వస్తే.. నో మ్యాడ్‌ ల్యాండ్‌ సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించారు. చోలే జావోకు ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్‌ దక్కింది. అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో ది ఫాదర్‌ చిత్రానికి అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే విభాగంలో ఎమరాల్డ్‌ ఫెన్నెల్‌కు ఆస్కార్‌ దక్కింది.