Oscars 2023 date time place all full details here
Oscars 2023 : ప్రపంచంలో సినిమా వాళ్లకు అత్యున్నత పురస్కారం ఆస్కార్. ప్రపంచంలోని అన్ని సినీ పరిశ్రమ వాళ్ళు, సినిమా వాళ్లంతా ఒక్కసారైనా కనీసం ఆస్కార్ వేదిక వరకైనా వెళ్ళాలి అనుకుంటారు. ఆస్కార్ వేదికపై మన ఇండియన్ సినిమా, సినిమా వ్యక్తులు చాలా తక్కువగా కనిపించారు, వినిపించారు. కానీ ఈ సారి మాత్రం మన ఇండియన్స్ అంతా ఆస్కార్ వేడుకల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం RRR సినిమా.
ప్రపంచవ్యాప్తంగా RRR సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. అంతర్జాతీయ వేదికపై అనేక అవార్డులు అందుకుంటున్న RRR సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది. RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ ముంగిట నిలిచింది. ఈ సారి ఇదొక్కటే కాకుండా డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం, డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిమ్స్ విభాగాల్లో ది ఎలిఫాంట్ విష్పర్స్, ఆల్ దట్ బ్రీత్స్ సినిమాలు కూడా నిలిచాయి. ఈ మూడు ఆస్కార్ అవార్డు కొట్టాలని భారతీయులంతా ప్రార్థిస్తున్నారు.
Manchu Vishnu : ఆ విషయంలో మాట నిలబెట్టుకున్న మంచు విష్ణు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం..
95వ ఆస్కార్ వేడుకలు అమెరికా టైం ప్రకారం మార్చ్ 12న రాత్రి 8 గంటలకు జరగనున్నాయి. మన ఇండియన్ టైం ప్రకారం మార్చ్ 13న ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలకు వేదిక కానుంది. అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ABC ఈ వేడుకల్ని తమ ప్లాట్ ఫామ్స్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సారి హోస్ట్ గా ప్రముఖ అమెరికన్ నటుడు, యాంకర్ జిమ్మీ కిమేల్ వ్యవహరించనున్నాడు. పలు లైవ్ పర్ఫార్మెన్స్ లో ఆస్కారం వేదికపై జరగనున్నాయి. ఇందులో మన RRR నాటు నాటు సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి పాడనున్నారు. మరో వారం రోజుల్లో ఆస్కార్ వేడుకలు జరగనుండటంతో ప్రపంచ సినీ ప్రేమికులంతా ఈ వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక RRR యూనిట్ మొత్తం ఆస్కార్ వేడుకలకు హాజరు కానున్నారు.
One. More. Week!
Tune into ABC to watch the Oscars LIVE on Sunday, March 12th at 8e/5p! #Oscars95 pic.twitter.com/lH4uD8taNR
— The Academy (@TheAcademy) March 5, 2023