OTT
OTT : సినిమాలకు సెన్సార్ ఉన్న సంగతి తెలిసిందే. అడల్ట్ కంటెంట్, న్యూడిటీ, అసభ్యకరమైన పదాలు, ఎక్కువ రక్తపాతం లాంటివి లేకుండా సినిమాలను సెన్సార్ చేసి రిలీజ్ చేస్తారు. అలాంటివి ఏమైనా ఉన్నా వాటికి తగ్గట్టు రేటింగ్స్ ఇచ్చి పెద్దల్ని మాత్రమే ఆ సినిమాలు చూసేలా చేస్తారు.(OTT)
అయితే ఇటీవల ఓటీటీలు అందరికి అందుబాటులో ఉంటున్నాయి. ఆ ఓటీటీలలో అసభ్యకర డైలాగ్స్, అడల్ట్ కంటెంట్, రక్తపాతం ఎక్కువగా వస్తున్నాయి. ఓటీటీలకు సెన్సార్ బోర్డు లేకపోవడంతో ఇష్టమొచ్చినట్టు కంటెంట్ వస్తుంది. దీంతో వీటిని కూడా సెన్సార్ పరిధిలోకి తీసుకురావాలని గత కొంతకాలంగా పలువురు ప్రజలు కోరుతున్నారు. దీనిపై చర్చలు కూడా జరిగాయి. అయితే తాజాగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువరించారు.
Also See : Shivani Nagaram : ఇన్నాళ్లు పద్దతిగా.. ఇప్పుడు హాట్ హాట్ ఫోజులతో.. లిటిల్ హార్ట్స్ భామ ఫొటోలు..
పార్లమెంట్ లో తాజాగా ఓటీటీలకు సెన్సార్ అనే అంశం చర్చలోకి వచ్చింది. దీంతో నెట్ ఫ్లిక్స్, అమెజాన్.. లాంటి అన్ని ఓటీటీలు సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) పరిధిలోకి రావు అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, డిజిటల్ మీడియా ఎథిక్స్ 2021 రూల్స్ ప్రకారం అవి సెన్సార్ బోర్డు కిందకు రావు అని లోక్ సభ లో ప్రకటించారు.దీంతో ఓటీటీలకు సెన్సార్ నిబంధనలు ఉండవు అని క్లారిటీ వచ్చేసింది.
అయితే సెన్సార్ లేకపోయినా కొన్ని నిబంధనలు మాత్రం పెట్టారు. అవేంటంటే.. చట్టం ద్వారా నిషేధించబడిన కంటెంట్‌ను కానీ, న్యూడిటీ కంటెంట్ కానీ ఓటీటీలు స్ట్రీమింగ్ చేయకూడదు. అలాగే ఓటీటీలలో ఉన్న కంటెంట్ ని ఏ వయసు వాళ్ళు చూడాలి అని వయస్సు ఆధారితంగా కంటెంట్ ని చూపించాలి. అలాగే కంటెంట్ తయారుచేసేవాళ్ళే స్వీయ నియంత్రణలో ఉండాలి. దీనికి గాను ప్రతి ఓటీటీ సంస్థలో ఒక టీమ్ ఉండాలి. న్యూడిటీ, ప్రైవసీ కి సంబంధించిన కంటెంట్ ఉన్నట్టు కేంద్రం దృష్టికి వస్తే 24 గంటల్లో తీసేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం యంత్రంగం ఓటీటీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది అని తెలిపారు.
Also Read : Varanasi : మహేష్ వారణాసి గురించి అడిగిన అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్.. అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..
దీంతో న్యూడిటీ, చట్ట వ్యతిరేక కంటెంట్ వరకు కంట్రోల్ చేయగలిగినా అసభ్య పదజాలం, మితిమీరిన రొమాన్స్, రక్తపాతం.. లాంటివి మాత్రం ఓటీటీలలో ఇకపై ఎక్కువే ఉంటాయని తెలుస్తుంది.