Varanasi : మహేష్ వారణాసి గురించి అడిగిన అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్.. అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..

జేమ్స్ కామెరాన్ డైరెక్ట్ చేసిన అవతార్ 3 సినిమా ఇండియాలో రిలీజ్ కాబోతుంది. (Varanasi)

Varanasi : మహేష్ వారణాసి గురించి అడిగిన అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్.. అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..

Varanasi

Updated On : December 17, 2025 / 2:48 PM IST

Varanasi : రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి సినిమాని పాన్ వరల్డ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి హాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేసారు రాజమౌళి. గతంలో RRR సినిమాతో రాజమౌళికి హాలీవుడ్ లో ప్రశంసలు దక్కాయి. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ జేమ్స్ కామెరాన్, క్రిస్టోఫర్ నోలన్.. లాంటి వాళ్ళు కూడా రాజమౌళి, RRR ని అభినందించారు.(Varanasi)

ఇప్పుడు జేమ్స్ కామెరాన్ డైరెక్ట్ చేసిన అవతార్ 3 సినిమా ఇండియాలో రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 19న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో రాజమౌళి తో జేమ్స్ కామెరాన్ ఒక వీడియో ఇంటర్వ్యూ చేసి ఇక్కడ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. రాజమౌళి రేంజ్ గుర్తించి అవతార్ టీమ్ ఇక్కడ ఇండియాలో ప్రమోషన్స్ కి ఆయన సహాయం తీసుకుంది. దీంతో రాజమౌళి – జేమ్స్ కామెరాన్ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read : Akhanda 3 : బాలయ్యతో మరో సినిమా.. అఖండ 3 పై బోయపాటి అప్డేట్.. ఎప్పుడంటే..?

అయితే ఈ ఇంటర్వ్యూలో జేమ్స్ కామెరాన్ మీరు కొత్త సినిమా వారణాసి సినిమా షూటింగ్ చేస్తున్నారు కదా అని రాజమౌళిని అడిగారు. దానికి రాజమౌళి.. ఆల్రెడీ ఒక సంవత్సరం అయింది షూట్ మొదలుపెట్టి ఇంకా ఏడు ఎనిమిది నెలలు పడుతుంది. షూటింగ్ మధ్యలో ఉన్నాము అని తెలిపాడు. దీంతో.. షూటింగ్ లో ఫన్ ఉన్నప్పుడు, టైగర్స్ తో షూట్ చేసినప్పుడు చెప్పండి నేను మీ సెట్ కి వస్తాను అని జామ్ కామెరాన్ తెలిపారు. అలాగే నేను మీ సెట్ కి వస్తాను. నాకు కెమెరా ఇవ్వండి సెకండ్ యూనిట్ డైరెక్టర్ లా డైరెక్ట్ చేస్తాను అని జేమ్స్ కామెరాన్ అన్నారు. RRR సినిమాలో ఎన్టీఆర్ టైగర్ ఎంట్రీ, టైగర్ ఫైట్ కి బాగా పేరొచ్చి హాలీవుడ్ వాళ్ళు తెగ ఇంప్రెస్ అయిన సంగతి తెలిసిందే. అందుకే టైగర్స్ తో షూట్ ఉంటే చెప్పమని జేమ్స్ కామెరాన్ సరదాగా అడిగారు అని తెలుస్తుంది.

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ మహేష్ – రాజమౌళి వారణాసి సినిమా గురించి అడగటంతో హాలీవుడ్ లో కూడా వారణాసి గురించి వెయిట్ చేస్తున్నారని మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో ఏడు ఎనిమిది నెలల్లో వారణాసి సినిమా షూటింగ్ కూడా అయిపోతుందని రాజమౌళి ఇచ్చిన అప్డేట్ తో కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.

Also Read : Director Kiran Kumar : టాలీవుడ్ లో విషాదం.. త్వరలో సినిమా రిలీజ్.. అంతలోనే దర్శకుడు మృతి..

రాజమౌళి – జేమ్స్ కామెరాన్ ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..