Paanch Minar Review
Paanch Minar Review : రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా తెరకెక్కిన సినిమా పాంచ్ మినార్. కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మాణంలో రామ్ కడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ, సుదర్శన్, కృష్ణ తేజ, లక్ష్మణ్ మీసాల.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. పాంచ్ మినార్ సినిమా నవంబర్ 21న రిలీజవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.(Paanch Minar Review)
కథ విషయానికొస్తే.. కిట్టు(రాజ్ తరుణ్) జాబ్ ట్రయల్స్ వేస్తూ ఆవారాగా తిరుగుతూ ఉంటాడు. లవర్ ఖ్యాతి(రాశిసింగ్), ఇంట్లో తండ్రి(బ్రహ్మాజీ) జాబ్ తెచ్చుకొమ్మని గొడవపెడుతూ ఉంటారు. క్రిప్టో కరెన్సీ లాంటి దాంట్లో డబ్బులు పెడితే ఎక్కువ వస్తాయని ఇంట్లో జాబ్ కోసం అని గొడవపడి మరీ ఐదు లక్షలు తీసుకొని అందులో పెట్టి లాస్ అవుతాడు కిట్టు. దీంతో ఆ డబ్బుల కోసం, ఖ్యాతి కోసం ఏదో ఒక జాబ్ చేయాలని తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఓ కంపెనీలో క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అవుతాడు. క్యాబ్ డ్రైవర్ అని తెలిస్తే పరువు పోతుందని బయట కృష్ణమూర్తి(అజయ్ ఘోష్) అనే ఒక రౌడీ దగ్గర సెకండ్ హ్యాండ్ కార్ EMI లో తీసుకుంటాడు. చెవుడు అని చెబితే డ్రైవర్ కి వచ్చే కమిషన్ ఎక్కువ వస్తుందని తన పేరుని ఆ డ్రైవర్లు లిస్ట్ లో పెట్టిస్తాడు కిట్టు.
ఒకరోజు ఒక ఇద్దరు క్రిమినల్స్ కిట్టు కార్ ఎక్కి ఒక చోటికి వెళ్ళి కార్ లో నుంచే చోటు(రవివర్మ)ని షూట్ చేసి చంపేస్తారు. కిట్టు షాక్ అయినా చెవుడు అని చెప్పాడు కాబట్టి అదే మెయింటైన్ చేస్తూ భయపడుతూ వాళ్లు మాట్లాడే మాటలు వింటాడు. కిట్టుని కూడా చంపేసి ఓ చోట డబ్బులు ఉన్నాయి తీసుకొని వెళ్దామని అనుకుంటారు క్రిమినల్స్. అనుకోకుండా కిట్టు వీళ్ళ దగ్గర తప్పించుకొని వీళ్ళు తీసుకోవాల్సిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ కారులో ఏదో ఉందని చెప్పి కృష్ణమూర్తి కార్ తెమ్మని ఎందుకు బెదిరిస్తాడు? కిట్టు ఆ డబ్బులతో ఏం చేశాడు? క్రిమినల్స్ కిట్టు కోసం వచ్చారా? ఆ కారులో ఏముంది? చోటును ఎవరు చంపారు? ఖ్యాతితో పెళ్లి అవుతుందా? ఈ సమస్యలన్నిటి నుంచి కిట్టు ఎలా బయటపడ్డాడు అని తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Divvela Madhuri : దువ్వాడ – దివ్వెల భలే ఛాన్స్ కొట్టేసారుగా.. ఆ హీరో సినిమాలో నటించిన జంట.. రేపే రిలీజ్..
రాజ్ తరుణ్ హిట్ కొట్టి చాన్నాళ్ళే అయింది. మధ్యలో పలు వివాదాల్లో నిలిచి వార్తలకెక్కాడు. అయినా వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు రాజ్ తరుణ్. దీంతో ఈ సినిమా కూడా పెద్దగా ఏమి ఉండదు అనుకున్నారు అంతా. ప్రమోషన్స్ కూడా సింపుల్ గానే చేసారు. కానీ సినిమా మాత్రం బాగానే ఉంది.
ఫస్ట్ హాఫ్ ఒక అరగంట రెగ్యులర్ లవ్ సీన్స్, ఫ్రెండ్స్ సీన్స్ తో బోర్ కొట్టిస్తారు. క్రిమినల్స్ కిట్టు కార్ ఎక్కిన దగ్గర్నుంచి సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. అసలు వాళ్లెవరు చోటుని ఎందుకు చంపారు? కిట్టు ఎలా బయటపడతాడు అని ఒక సస్పెన్స్ తో సాగుతుంది. ఇంటర్వెల్ కి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే బ్యాంగ్ పర్ఫెక్ట్ గా పడింది. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ప్యాక్ సస్పెన్స్ క్రైం కామెడీతో కథని పరిగెత్తించారు. ఓ వైపు క్రిమినల్స్, ఓ వైపు కృష్ణమూర్తి, ఓ వైపు పోలీస్, మరో వైపు ఖ్యాతి ప్రేమ, మధ్యలో ఫ్యామిలీ.. ఇలా అందరి మధ్యలో కిట్టు నలిగిపోతూ ఓ పక్క నవ్విస్తూనే మరో పక్క నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్ ని బిల్డ్ చేసారు.
ఫస్ట్ హాఫ్ సో సోగా నడిపించినా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా నడిపించారు. అయితే ఈ సినిమా ఎపుడో ఓ మూడు నాలుగేళ్ల క్రితం తీసిందేమో అని అనుమానం రాక మానదు. కొన్నాళ్ల క్రితం చనిపోయిన ఫిష్ వెంకట్ ఈ సినిమాలో ఉన్నాడంటేనే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా ఎప్పటిదో. సినిమా బాగానే ఉంది కాబట్టి రాజ్ తరుణ్, మూవీ టీమ్ ఇంకాస్త ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టాల్సింది.
నటీనటుల పర్ఫార్మెన్స్..
ఫస్ట్ హాఫ్ అంతా రాజ్ తరుణ్ రెగ్యులర్ యాక్టింగ్ అనిపించినా సెకండ్ హాఫ్ లో అందరి మధ్యలో నలిగిపోతూ బాగానే నటించాడు. రాశి సింగ్ కేవలం ఓ నాలుగు లవ్ సీన్స్, సాంగ్ వరకే పరిమితం. రౌడీ దగ్గర అసిస్టెంట్ గా లక్ష్మణ్ మీసాల బాగా నవ్విస్తాడు. నితిన్ ప్రసన్న నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ పాత్రలో బాగానే మెప్పించాడు. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ.. అక్కడక్కడా నవ్విస్తారు. జీవా, రవివర్మ, కృష్ణతేజ, శ్రీనివాస రెడ్డి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : I Bomma : ఓరి బాబు.. ఐ బొమ్మ పోయింది అనుకునేలోపే ఇంకో బొమ్మ.. కానీ క్లిక్ చేస్తే..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ థ్రిల్ కి తగ్గట్టు బాగానే ఇచ్చారు. పాటలు యావరేజ్. ఎడిటింగ్ మాత్రం ఫస్ట్ హాఫ్ లో కొన్ని అక్కర్లేని సీన్స్, ఓ పాట కట్ చేస్తే బాగుండేది. రెగ్యులర్ క్రైం కామెడీ సినిమా అయినా మంచి స్క్రీన్ ప్లే, సస్పెన్స్ ఉండేలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ‘పాంచ్ మినార్’ సస్పెన్స్ తో సాగుతూ నవ్వించిన క్రైం కామెడీ సినిమా. థియేటర్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఓ సారి చూడొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.