T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడిస్తే జింబాబ్వే కుర్రాడిని పెళ్లి చేసుకుంటానని పాక్ నటి ప్రకటన..

ప్రపంచవ్యాప్తంగా ఐసిసి టి20 వరల్డ్ కప్ గురించే చర్చ జరుగుతుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్, బంగ్లాదేశ్ తో పోరాడింది. ఉత్కంఠ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా పాకిస్తాన్ నటి "సెహర్ షిన్వారీ" రాబోయే మ్యాచ్...

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడిస్తే జింబాబ్వే కుర్రాడిని పెళ్లి చేసుకుంటానని పాక్ నటి ప్రకటన..

Pakistani actress announces that she will marry a Zimbabwean boy if India defeats T20 World Cup.

Updated On : November 3, 2022 / 10:26 PM IST

T20 World Cup: ప్రపంచవ్యాప్తంగా ఐసిసి టి20 వరల్డ్ కప్ గురించే చర్చ జరుగుతుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్, బంగ్లాదేశ్ తో పోరాడింది. మ్యాచ్ మధ్యలో వర్షం పడి కొంత విరామం వచ్చినా, అది భారత్ జట్టుకు కలిసొచ్చింది అనే చెప్పాలి. ఉత్కంఠ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే పాక్ అభిమానులు భారత్ వరల్డ్ కప్ పోరులో ఓడి వెనుదిరగాలి అంటూ వారి అక్కసుని చూపిస్తున్నారు.

Ram Charan: ఆఫ్రికన్ సింహాల మధ్య టాలీవుడ్ చిరుత పులి.. చరణ్-ఉపాసన హాలిడే పిక్స్..

నవంబర్ 6, ఆదివారం నాడు జరిగే మ్యాచ్ భారత్ కి చాలా కీలకం కానుంది. సూపర్ 12 మ్యాచ్‌లో చివరిగా భారత్ జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. కాగా పాకిస్తాన్ నటి “సెహర్ షిన్వారీ” రాబోయే మ్యాచ్ గురించి ఒక ఆశక్తికర ట్వీట్ చేసింది. “ఆదివారం జరగబోయే మ్యాచ్ లో జింబాబ్వే ఇండియాని ఓడిస్తే నేను ఒక జింబాబ్వే వ్యక్తిని పెళ్లి చేసుకుంటా” అంటూ ట్వీట్ చేసింది.

ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. గతంలో కూడా ఈ నటి ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చింది. ‘భారత్ గెలిస్తే నేను నా ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేస్తాను’ అంటూ చెప్పుకురావడంతో, నెటిజెన్లు ఈ ట్వీట్స్ సంగతి ఏంటి అంటూ పాతవి రీ ట్వీట్స్ చేస్తున్నారు. మరి ఆదివారం జారబోయే మ్యాచ్ లో భారత్ గెలవనుందా లేక జింబాబ్వే గెలవనుందా చూడాలి.