‘పలాస 1978’ టీజర్ : కత్తి పట్టుకుని పుట్టామా?
లండన్ బాబులు ఫేమ్ రక్షిత్, నక్షత్ర జంటగా నటిస్తున్న ‘పలాస 1978’ టీజర్.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ చేతుల మీదుగా విడుదలైంది..

లండన్ బాబులు ఫేమ్ రక్షిత్, నక్షత్ర జంటగా నటిస్తున్న ‘పలాస 1978’ టీజర్.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ చేతుల మీదుగా విడుదలైంది..
లండన్ బాబులు ఫేమ్ రక్షిత్, నక్షత్ర జంటగా, ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో, సుధాస్ మీడియా బ్యానర్‌పై ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న సినిమా..‘పలాస 1978’.. యదార్థ సంఘటనల ఆధారంగా క్రైమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీని కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ‘పలాస 1978’ టీజర్.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ చేతుల మీదుగా విడుదలైంది.
బ్యాగ్రౌండ్‌లో సాంగ్ వినిపిస్తుండగా టీజర్ సాగుతుంది. శ్రీకాకుళం జిల్లాలోని పలాస గ్రామం నేపథ్యంలో జరిగే కథ అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. టీజర్ చివర్లో రక్షిత్ చెప్పిన డైలాగు ఆకట్టుకుంటుంది. టీజర్‌లో వినిపించిన పాటకు భాస్కరభట్ల లిరిక్స్ రాయగా, విజయ లక్ష్మీ పాడారు. సంగీత దర్శకుడు రఘు కుంచె ఇంపార్టెంట్ రోల్ చేశారు.
Read Also : ఇస్మార్ట్ శంకర్ : ‘జిందాబాద్ జిందాబాద్’ వీడియో సాంగ్..
త్వరలో ‘పలాస 1978’ విడుదల కానుంది. సంగీతం : రఘు కుంచె, కెమెరా : అరుల్ విన్సెంట్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల, లక్ష్మీ భూపాల, బండి సత్యం, యాక్షన్ : రామ్ సుంకర.