Project K: పాన్ వరల్డ్ ఫిల్మ్.. సెట్‌లో అడుగుపెట్టిన ప్రభాస్!
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పార్లర్ గా ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ మీదకి తీసుకెళ్లిన ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్..
- Naresh Mannam
- Published On : December 10, 2021 / 03:35 PM IST
Prabhas (1)
Project K: రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పార్లర్ గా ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ మీదకి తీసుకెళ్లిన ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలు పూర్తి కాకుండానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమాను కూడా మొదలు పెట్టేశాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సంవత్సరంన్నర క్రితం అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ కె భారీ బడ్జెట్ తో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకుంది.
RRR: రోజుకో వీడియో.. పూటకో పోస్టర్.. ప్రమోషన్స్ పీక్స్!
ఇప్పటికే మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్ కె ఫుల్ ఫ్లెడ్జ్ షూటింగ్ కూడా మొదలు పెట్టేసింది. రెండు రోజుల క్రితమే హీరోయిన్ దీపికా పదుకొనె హైదరాబాద్ కూడా వచ్చేయగా ప్రభాస్ అండ్ టీమ్ ఆమెకి గ్రాండ్ వెల్కమ్ చెప్పి షూటింగ్ కూడా మొదలు పెట్టనుంది. ఈ కొత్త షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోస్ లో స్టార్ట్ చేసుకోగా ఈ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడట.
Radhe Shyam: విజువల్ ట్రీట్.. దుమ్మురేపుతున్న సోచ్ లియా సాంగ్!
శుక్రవారం ప్రభాస్ ఈ సెట్ లో అడుగుపెట్టగా మరో వారం రోజుల పాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కె కోసం ఇక్కడే ఉండనున్నాడట. మరోవైపు ప్రశాంత్ నీల్ సలార్ సినిమా ప్రీ క్లైమాక్స్ రీషూట్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుండగా ఆదిపురుష్ సినిమాకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా ప్రభాస్ జనవరిలో ఒక సినిమా విడుదల కానుండగా ఆ తర్వాత ఒకేసారి మరో మూడు సినిమాలు లైన్లో పెట్టనున్నాడు. ప్రాజెక్ట్ కె షూటింగ్ మొదలవడంతో ఇప్పుడు ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
#Prabhas to join the sets of #ProjectK today.
Major schedule currently happening in Hyderabad.
— Manobala Vijayabalan (@ManobalaV) December 10, 2021
