Pandu Father
Pandu Father : ఢీ షోతో ఫేమ్ తెచ్చుకున్న పండు ఇప్పుడు ఆర్టిస్ట్ గా, డ్యాన్స్ మాస్టర్ గా, ఢీ షోలో డ్యాన్సర్ గా చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పండు అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో తన తండ్రి గురించి మాట్లాడాడు. (Pandu Father)
పండు మాస్టర్ మాట్లాడుతూ.. మా నాన్న ఆటో డ్రైవర్. ఇప్పటికి అదే ఆటో నడుపుతారు. ఆ ఆటో కొని 20 ఏళ్ళు అయింది. నేను వద్దు అన్నా అదే ఆటో నడుపుతారు. ఆయన డబ్బులతో కొనుక్కున్నారు అని సెంటిమెంట్. నెల నెలా దానికి రిపేర్ కి డబ్బులు బాగానే అవుతాయి. అయినా దాన్నే నడుపుతారు. పోనీ నేను కొత్తది కొనిస్తా అంటే వద్దంటారు. ఈ పాత ఆటో మాత్రం వదలను అంటారు. ఆయనతో ఆటోలు నడిపేవాళ్ళందరికి తెలుసు నేను ఆయన కొడుకుని అని. అయినా ఆయన పట్టించుకోరు. మా నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు యాంకర్ ప్రదీప్ అన్నే నాకు హెల్ప్ చేసాడు. అది ప్రదీప్ అన్న ఎక్కడా చెప్పనివ్వరు అని తెలిపాడు.
Also Read : RGV War 2 : ఎన్టీఆర్ సినిమాపై ఆర్జీవీ వ్యాఖ్యలు వైరల్.. లాజిక్ లేదు అంటూ..