Pandu Master : వామ్మో.. ఇన్‌స్టాగ్రామ్ లో అమ్మాయిలు ఇలా చేస్తున్నారా.. ఢీ పండు చెప్పింది వింటే.. మీరు జాగ్రత్త..

ఢీ షోతో ఫేమ్ తెచ్చుకున్న పండు నటుడిగా, డ్యాన్సర్ గా బిజీగానే ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పండు మాస్టర్ ఈ విషయం తెలిపారు.(Pandu Master)

Pandu Master

Pandu Master : ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా మంచి కంటే చెడునే ప్రమోట్ చేస్తుంది. అనేకమంది ఈ సోషల్ మీడియాని తప్పుడు పనులకు వాడుతున్నారు. సెలబ్రిటీలు కూడా కొంతమంది చేసే పనులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇప్పుడు సెలబ్రిటీలను, మాములు జనాలను సోషల్ మీడియా బాగా దగ్గర చేయడంతో ఫ్యాన్స్, జనాలు సెలబ్రిటీలకు డైరెక్ట్ గా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లో మెసేజ్ లు చేస్తున్నారు.(Pandu Master)

అయితే ఇలా మెసేజ్ చేయడంతో కొంతమంది దాన్ని ఎలా నెగిటివ్ చేస్తున్నారు అని ఢీ పండు మాస్టర్ ఓ విషయం తెలిపాడు. ఢీ షోతో ఫేమ్ తెచ్చుకున్న పండు ప్రస్తుతం నటుడిగా, డ్యాన్సర్ గా బిజీగానే ఉన్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పండు మాస్టర్ ఈ ఆసక్తికర విషయం తెలిపారు.

Also Read : Manchu Manoj : తను చెన్నైలో పెద్ద రౌడీ.. ప్రభాస్ హీరోయిన్ పై మంచు మనోజ్ కామెంట్స్ వైరల్..

పండు మాస్టర్ మాట్లాడుతూ.. కొంతమంది అమ్మాయిలు నాకు హాయ్ అని మెసేజ్ చేస్తారు. సరే ఫ్యాన్స్ చేస్తారు కదా అని నేను హాయ్ అని మెసేజ్ పెడతాను. అప్పుడు వాళ్ళు పెట్టిన మెసేజ్ డిలీట్ చేసి మళ్ళీ నా మెసేజ్ కింద హాయ్ అని పెట్టి స్క్రీన్ షాట్ తీసుకుంటారు. ఆ స్క్రీన్ షాట్ అందరికి చూపించి, సోషల్ మీడియాలో స్టోరీలు పెట్టి పండు నాకు మెసేజ్ చేసాడు అని నన్ను బ్యాడ్ చేస్తారు. మెసేజ్ చేసింది ఫస్ట్ వాళ్ళు కానీ నేను చేసినట్టు క్రియేట్ చేస్తారు. అలాంటి అనుభవాలు అయ్యాక నేను ఇన్‌స్టాగ్రామ్ లో వ్యానిష్ మోడ్ వాడుతున్నాను. అందులో వాళ్ళు స్క్రీన్ షాట్ తీస్తే తెలిసిపోతుంది. అప్పుడు నేను స్క్రీన్ షాట్ ఎందుకు తీసావు అని గట్టిగా అడుగుతాను అని తెలిపాడు.

దీంతో అమ్మాయిలు సోషల్ మీడియాలో ఇలా కూడా చేస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. సెలబ్రిటీలకు మెసేజ్ చేసి వాళ్లే చేసినట్టు క్రియేట్ చేసి వాళ్ళని బ్యాడ్ చేస్తున్నారు అంటూ పలువురు పండు కామెంట్స్ పై పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల స్కామ్ లు చేస్తున్నారు. ఇది తెలుసుకోకపోతే పండు లాగే ఎవరో ఒకరు సెలబ్రిటీలు, మాములు జనాలు కూడా భాదితులు అవుతారేమో అని అంటున్నారు. అందుకే తెలియని అకౌంట్ నుంచి మెసేజ్ వస్తే రిప్లై ఇవ్వకపోవడమే మంచిది అని అభిప్రాయపడుతున్నారు.

Also Read : Prabhas : ప్రభాస్ సినిమాకు మళ్ళీ ఇబ్బందులు..? సంక్రాంతికి కూడా డౌటేనా? షూటింగ్ ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?