అబ్దాలీ నీడ పడితే మరణం ప్రళయ తాండవం చేస్తుంది : ‘పానిపట్’ ట్రైలర్

ర్జున్‌ కపూర్‌, సంజయ్‌ దత్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్‌’.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : November 5, 2019 / 07:53 AM IST
అబ్దాలీ నీడ పడితే మరణం ప్రళయ తాండవం చేస్తుంది : ‘పానిపట్’ ట్రైలర్

Updated On : November 5, 2019 / 7:53 AM IST

ర్జున్‌ కపూర్‌, సంజయ్‌ దత్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్‌’.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

మరాఠా చరిత్రలో జరిగిన పానిపట్టు యుద్ధం ఆధారంగా అర్జున్‌ కపూర్‌, సంజయ్‌ దత్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ మూవీ ‘పానిపట్‌’.. అశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేస్తున్నారు. సోమవారం ‘పానిపట్’ సినిమా నుంచి క్యారెక్టర్ పోస్టర్స్ రిలీజ్ చేసిన టీమ్, మంగళవారం (నవంబర్ 5) థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది. అర్జున్ కపూర్ మరాఠా నాయకుడు ‘సదాశివ రావు’ పాత్రలో చక్కగా సరిపోయాడు.. కృతి సనన్, సదాశివ రావు భార్య ‘పార్వతీ బాయి’ క్యారెక్టర్ చేస్తుంది.

సంజయ్‌ దత్‌ ‘అహ్మద్‌ షా అబ్దాలీ’ పాత్రలో నటిస్తున్నారు.. ‘అహ్మద్‌ షా అబ్దాలీ.. అతడి నీడ ఎక్కడ పడితే అక్కడ మరణం ప్రళయ తాండవం చేస్తుంది’ అంటూ సంజయ్ క్యారెక్టర్‌ని చూపించారు.. ఆయన బాడీ లాంగ్వేజ్ అబ్దాలీ పాత్రకు హుందాతనం తీసుకొచ్చింది.. విజువల్స్, ఆర్ఆర్, ఆర్ట్ వర్క్ చక్కగా సెట్ అయ్యాయి.. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సినిమాలోని భారీతనమంతా ట్రైలర్‌లో చూపించారు. ‘పానిపట్’ డిసెంబర్‌ 6న విడుదల కానుంది.

Read Also : పదిమంది ఉండగా.. ‘ప్రతిరోజూ పండగే’

సంగీతం : అజయ్‌-అతుల్‌, కెమెరా : సి.కె.మురళీధరన్, ఎడిటింగ్ : స్టీవెన్ బెర్నార్డ్, ప్రొడక్షన్ డిజైనర్ : నితిన్ చంద్రకాంత్ దేశాయ్, ఎస్ఎఫ్‌ఎక్స్ : విశాల్ త్యాగి, యాక్షన్ : అబ్బాస్ అలీ మొఘల్,  బ్యానర్స్ : అశుతోష్‌ గోవారికర్‌ ప్రొడక్షన్స్‌, విజన్‌ వరల్డ్‌ ఫిల్మ్స్‌, ప్రొడ్యూసర్స్ : సునీతా గోవారికర్, రోహిత్ షేలత్కర్..