Parineeti Chopra-Raghav Chadha : పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా మ్యారేడ్ డేట్ ఫిక్స్? డెస్టినేషన్ ఎక్కడంటే..

పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా ఈ నెలాఖరులో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సెప్టెంబర్ 17 న వీరి వివాహ వేడుకలు ప్రారంభమై సెప్టెంబర్ 24 ముగుస్తాయని తెలుస్తోంది. రాజస్థాన్‌లో వీరి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట.

Parineeti Chopra-Raghav Chadha : పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా మ్యారేడ్ డేట్ ఫిక్స్? డెస్టినేషన్ ఎక్కడంటే..

Parineeti Chopra-Raghav Chadha

Updated On : September 6, 2023 / 12:47 PM IST

Parineeti Chopra-Raghav Chadha : బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహ నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఈ నెలాఖరున రాజస్ధాన్‌లో ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది.

Parineeti Chopra : పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఎంగేజ్మెంట్ ఫోటోలు..

పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా పెళ్లి వార్తలతో ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు. మే నెలలో ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే సెప్టెంబర్ 17న వీరి వివాహ వేడుకలు ది లీలా ప్యాలెస్, ఉదయ్ పూర్‌లో జరగనున్నాయి. ఈ వేడుకలు సెప్టెంబర్ 24 న ముగుస్తాయని సమాచారం. వీరి వివాహానికి అనేకమంది రాజకీయ నాయకులు హాజరుకానున్న నేపథ్యంలో హోటళ్లకు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు.

పెళ్లి వేడుకలు సెప్టెంబర్ 23,24 తేదీల్లో లీలా ప్యాలెస్, ది ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో జరుగుతాయి. 200 మందికి పైగా అతిథులు, 50 కి పైగా వీవీఐపీ అతిథులు బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు సెప్టెంబర్ 23 న ప్రారంభమవుతాయి. పెళ్లి తరువాత హర్యానాలోని గురుగ్రామ్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారట. ఇటీవలే రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఉదయ్ పూర్ సందర్శించారు.

Madhya Pradesh : పెళ్లికి ముందే ఉజ్జయినీ మహాకాళేశ్వర్ టెంపుల్‌లో పరిణీతి, రాఘవ్ చద్దా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాలు ఈ సంవత్సర ప్రారంభంలో ముంబయిలో ఓ హోటల్‌లో డిన్నర్ చేస్తూ కలిసి తీసుకున్న ఫోటోలు బయటకు రావడంతో వీరి డేటింగ్ పుకార్లు బయటకు వచ్చాయి. తర్వాత ఇద్దరు ఎయిర్ పోర్టులలో కనిపించారు. ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా కనిపించారు. ఇక వీరి నిశ్చితార్ధంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.