Parineeti Chopra : పెళ్ళికి పిలుస్తారా అంటూ ఫోటోగ్రాఫర్ ప్రశ్న.. సిగ్గుపడ్డ పరిణీతి, రాఘవ్ చద్దా.. వీడియో వైరల్!

మొన్నటివరకు ముంబై వీధుల్లో చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన పరిణీతి చోప్రా, అప్ ఎంపీ రాఘవ్ చద్దా ఈ శనివారం పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. నిశ్చితార్థం కోసం ఢిల్లీ చేరుకున్న..

Parineeti Chopra : బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వారిద్దరి కూడా ముంబై వీధుల్లో డిన్నర్, లంచ్ అంటూ కలిసి రెస్టారెంట్స్ చుట్టూ తిరుగుతూ బాలీవుడ్ మీడియా లెన్స్ కి చిక్కుతూ వచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వచ్చాయి. తాజాగా వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది.

Vijay Deverakonda vs Anasuya : విజయ్ దేవరకొండ విషెస్ చెబుతూ.. హరీష్ శంకర్ అనసూయకు కౌంటర్ ఇచ్చాడా?

ఈ శనివారం (మే 13) పరిణీతి, రాఘవ్ చద్దా నిశ్చితార్థం చేసుకోబోతున్నారని, ఢిల్లీలో ఈ వేడుక జరగబోతుందని బాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. తాజాగా వీరిద్దరూ కలిసి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరుకోవడంతో ఆ వార్తలు నిజమనేలా ఉన్నాయి. ఇక ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన పరిణీతి అండ్ రాఘవ్ చద్దాని ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్స్ ప్రయత్నిస్తున్నారు. ఆ ఫోటోగ్రాఫర్స్ ఒక అతను వారిద్దర్నీ ఒక్క ఫోటో అడుగుతూ.. మమ్మల్ని పెళ్ళికి పిలుస్తారా? అంటూ ప్రశ్నించాడు.

Akhil Akkineni : ప్రభాస్ ప్రొడక్షన్‌లో సాహూ అసిస్టెంట్ డైరెక్టర్‌తో అఖిల్ సినిమా.. నిజమేనా?

ఇక ఆ ప్రశ్నకు పరిణీతి, రాఘవ్ చద్దా నవ్వుకుంటూ సిగ్గుపడ్డారు. ఫోటోగ్రాఫర్ పెళ్లి శుభాకాంక్షలు తెలియజేయగా థాంక్యూ అంటూ పరిణీతి బదులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ నిశ్చితార్థంకి ఇరు కుటుంబసభ్యులు, మిత్రులతో పాటు దాదాపు 150 మంది అతిథులు హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఇక పెళ్లి ముహుర్తాన్ని ఇంకా ఫైనల్ చేయనప్పటికీ, ఈ ఏడాది చివరిలో వీరిద్దరి పెళ్లి ఉండవచ్చని తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు