Jabardasth Praveen
Jabardasth Praveen : ఒక్కోసారి టీవీ ఈవెంట్స్ లో లవ్ ప్రపోజల్స్, ప్రేమలు బయటపెట్టడాలు, పెళ్లిళ్లు.. అన్ని చేస్తారు. అయితే అవి నిజమో కాదో మాత్రం తెలీదు. స్కిట్స్ లో చేస్తే అవి స్కిట్ కోసం అనుకుంటారు. కానీ ఎలాంటి సందర్భం లేకుండా ఈ లవ్ మ్యాటర్స్ జరిగితే మాత్రం నిజమేనా అని డౌట్ రాక మానదు. తాజాగా జబర్దస్త్ ప్రవీణ్ జబర్దస్త్ వేదికపై ఓ నటికి లవ్ ప్రపోజ్ చేసాడు.(Jabardasth Praveen)
పటాస్ తో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ గతంలో పటాస్ ఫైమా తో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వచ్చిన ఫైమా అదేమీ లేదు అని కొట్టేసి తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. తాజాగా జబర్దస్త్ నుంచి రిలీజయిన ప్రోమోలో యామిని అనే నటికి ప్రవీణ్ ప్రపోజ్ చేసాడు.
Also Read : Actress Hema : ఆ సమయంలో చిరంజీవి గారి సపోర్ట్.. వాళ్ళ మనిషిని పంపించి.. ఆ హీరో దగ్గర ఏడ్చేశాను..
ప్రవీణ్ స్కిట్ అయ్యాక స్టేజిపై అందరి ముందు.. యామిని గారిని గతంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో చూశాను ఒకసారి. తనకు కూడా ఈ విషయం తెలీదు. నాకు ఏమనిపించింది అంటే తను నాకెందుకో సూట్ అవుతుంది. నేను తనను చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. యామిని గారు మీరు ఒప్పుకుంటే నేను మా అమ్మలా చూసుకుంటా. ఎందుకంటే నాకు ఎవరూ లేని లోటు మీరు తీరుస్తారని నేను అనుకుంటున్నా. ఐ లవ్ యు అని ప్రపోజ్ చేసాడు. దీనికి యామిని సిగ్గుపడుతూ నవ్వింది.
మరి ఇది నిజం ప్రపోజలా లేక షో కోసం చేసారా అంటే ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే. ఇక ప్రవీణ్ ప్రపోజ్ చేసిన యామిని ఎవరంటే.. యామిని బండారు తెలుగమ్మాయి. నటిగా ఇప్పటికే రామచక్కని సీత సీరియల్ లో, నారాయణ &కో అనే సినిమాలో నటించింది. అలాగే పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. శ్రీదేవి డ్రామా కంపెనీ, స్టార్ మా పరివార్.. లాంటి పలు టీవీ షోలలో కూడా యామిని పాల్గొంది. ఇప్పుడు ఇలా జబర్దస్త్ లో ప్రవీణ్ టీమ్ లో స్కిట్స్ చేసింది. ప్రవీణ్ స్టేజిపై ప్రపోజ్ చేయాంతో యామిని ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read : Samantha : పెళ్లి తర్వాత అత్తగారి ఫ్యామిలీతో సమంత.. ఫుల్ ఫ్యామిలీ ఫోటో వైరల్.. ఈ ఫొటోలో ఎవెరెవరు ఉన్నారంటే..
మీరు కూడా ప్రవీణ్ యామిని కి ప్రపోజ్ చేసిన జబర్దస్త్ ప్రోమో చూసేయండి..