Pathaan movie collects 600 crores in 6 Days
Pathaan Collections : షారుఖ్ ఖాన్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా ఇటీవల జనవరి 25న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. నాలుగేళ్ల తర్వాత షారుఖ్ తెరపై కనిపిస్తుండటంతో అభిమానులు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. పఠాన్ సినిమా రిలీజ్ కి ముందు నుంచే కల్క్షన్స్ లో రికార్డులు కొడుతుంది.
సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 50 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక మొదటి రోజు పఠాన్ సినిమా 102 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అప్పట్నుంచి రోజుకి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటికే పఠాన్ సినిమా అయిదు రోజుల్లో 542 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇండియాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది పఠాన్. ఆదివారం ఒక్కరోజే దాదాపు 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
తాజాగా పఠాన్ సోమవారం నాటికి ఆరు రోజుల్లో ఆరొందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే సోమవారం నాడు కలెక్షన్స్ తగ్గినా అయిదు రోజుల తర్వాత, వీక్ డేస్ లో కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అంటే మాములు విషయం కాదు. ఆరో రోజు సోమవారం నాడు పఠాన్ సినిమా 55 కోట్లకు పైగా గ్రాస్ కల్క్షన్స్ అంటే దాదాపు 25 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి ఆరు రోజుల్లో 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని దాటింది. దీంతో పఠాన్ సినిమా యిప్పటికే 300కి పైగా షేర్ కలెక్షన్స్ వసూలు చేసి ప్రాఫిట్స్ లో ఉంది. వీక్ డేస్ లో కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తుండటంతో బాలీవుడ్ సంబరపడిపోతుంది. 1000 కోట్ల టార్గెట్ తో పఠాన్ ప్రస్తుతం దూసుకుపోతుంది.
#Pathaan early estimates for Day 6 All-India Nett would be ₹ 25 Crs..
Will cross ₹ 300 Crs Nett..
— Ramesh Bala (@rameshlaus) January 31, 2023
#Pathaan crosses ₹ 600 Crs WW Gross in 6 days.. ?
Holding very well on weekdays..
— Ramesh Bala (@rameshlaus) January 31, 2023