Pathaan: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ రిలీజ్’కు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో షారుక్ ఎలాగైనా తిరిగి సక్సెస్ అందుకోవాలని తీవ్రంగా కష్టపడ్డాడు. ఆయన పడ్డ కష్టం మనకు ఈ సినిమాలో కనిపిస్తుంది. అయితే గతకొంత కాలంగా బాయ్‌కాట్ బాలీవుడ్ అని కొందరు నిరసన వ్యక్తం చేస్తుండటం.. సోషల్ మీడియాలో ఈ నిరసనను పెద్ద ఎత్తున వ్యాప్తి చేయడంతో బాలీవుడ్లో రిలీజ్ అయిన చాలా సినిమాలపై ఎఫెక్ట్ పడింది.
Pathaan: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో తూఫాన్ సృష్టిస్తోన్న ‘పఠాన్’
బాలీవుడ్లో సరైన సక్సెస్ అందుకున్న సినిమా వచ్చి చాలా రోజులవుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమా వస్తుందంటే ఆ సందడి దేశవ్యాప్తంగా కనిపించేంది. కానీ, ఇటీవల అలాంటి క్రేజ్ ఏ సినిమాకు కూడా దక్కలేదు. దీంతో పఠాన్ సినిమాకు కూడా ఇలాంటి కష్టాలు తప్పవని పలువురు సినీ ఎక్స్పర్ట్స్ భావించారు. అటు బాయ్‌కాట్ బ్యాచ్ కూడా ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే పఠాన్ సినిమాకు రిలీజ్ కంటే ముందే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ రూపంలో అదిరిపోయే కలెక్షన్స్ రావడంతో ఈ సినిమా గ్యారెంటీగా తొలిరోజే మంచి వసూళ్లను రాబడుతుందని అందరూ ధీమా వ్యక్తం చేశారు.
ఇక ఈ సినిమా రిలీజ్ రోజున మంచి టాక్‌ను సొంతం చేసుకోవడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశంగా చెప్పుకోవాలి. ఈ సినిమాకు అనుకున్నదానికంటే ప్రేక్షకులు ఎక్కువ రెస్పాన్స్ చూపించారు. ఒక నాన్-హాలీడే రోజున కూడా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడంతో షారుక్ సినిమా కోసం వారందరూ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థం అయ్యింది. కట్ చేస్తే.. పఠాన్ సినిమా తొలిరోజే వంద కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఇక రెండో రోజున కూడా తన పరుగును కంటిన్యూ చేస్తూ వరుసగా రెండో రోజు కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి షారుక్ స్టామినా ఏమిటో మరోసారి ప్రూవ్ చేసింది.
Pathaan: పఠాన్ బాక్సాఫీస్ ఊచకోత.. ఆల్‌టైమ్ రికార్డును సెట్ చేసిన బాద్షా
ఈ సినిమాతో షారుక్ ఖాన్ తాను మాత్రమే కమ్‌బ్యాక్ అవ్వడం కాదు.. బాలీవుడ్‌ను కూడా తిరిగి సక్సెస్ ట్రాక్‌పైకి తీసుకొచ్చాడని పలువురు సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి థండరింగ్ కలెక్షన్స్ చూసి చాలా రోజులు కావడంతో బాలీవుడ్‌కు తిరిగి పాతరోజులు వచ్చాయని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా షారుక్ బాక్సాఫీస్ పాలిట నిజమైన బాద్షా అని అభిమానులు అంటున్నారు.