Pathaan: పఠాన్ బాక్సాఫీస్ ఊచకోత.. ఆల్‌టైమ్ రికార్డును సెట్ చేసిన బాద్‌షా

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’పై మొదట్నుండీ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించగా, పూర్తి స్పై థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమాను యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తీర్చిదిద్దింది. ఇక ఈ సినిమాలో షారుఖ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలిరోజు అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.

Pathaan: పఠాన్ బాక్సాఫీస్ ఊచకోత.. ఆల్‌టైమ్ రికార్డును సెట్ చేసిన బాద్‌షా

Shah Rukh Khan Pathaan Creates All-Time Record In Bollywood

Pathaan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’పై మొదట్నుండీ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించగా, పూర్తి స్పై థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమాను యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తీర్చిదిద్దింది. ఇక ఈ సినిమాలో షారుఖ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలిరోజు అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.

Pathaan Review : పఠాన్.. పాత కథకి సూపర్ యాక్షన్ సీన్స్ జోడింపు..

ఇక ఈ సినిమాను చూసేందుకు కింగ్ ఖాన్ అభిమానులు ఎంతో ఆసక్తిని చూపడంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతున్నట్లుగా సినీ వర్గాలు తెలిపాయి. అందరూ అనుకున్నట్లుగానే ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద పఠాన్ మూవీ తొలిరోజే అద్భుతమైన వసూళ్లు రాబట్టినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఇండియాలోనే పఠాన్ మూవీ తొలిరోజు ఏకంగా రూ. 57 కోట్ల మేర వసూళ్లు సాధించినట్లుగా తెలుస్తోంది.

Pathaan : సంక్రాంతి నుంచి పడిపోతున్న PVR స్టాక్ ప్రైజ్.. పఠాన్ దెబ్బతో మళ్ళీ ఫామ్ లోకి..

హిందీ భాషలో ఈ సినిమా తొలిరోజే రూ.55 కోట్ల మేర వసూళ్లు సాధించి హిందీ చిత్రాల్లో టాప్ వన్ మూవీగా నిలిచింది. నాన్-హాలీడే రోజున ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టి పఠాన్ ఔరా అనిపించింది. గతంలో వార్(రూ.51 కోట్లు), కేజీయఫ్-2 హిందీ(రూ.53 కోట్లు) వసూళ్లను పఠాన్ వెనక్కి నెట్టేసిందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇక ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100-110 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టి ఉంటుందని వారు అంచనాలు వేస్తున్నారు. ఇంకా ఈ సినిమా మున్ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.