Pathaan: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో తూఫాన్ సృష్టిస్తోన్న ‘పఠాన్’

బాలీవుడ్‌లో గతకొంత కాలంగా ఖాన్ త్రయంల సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, ఇక ఖాన్‌ల సినిమాలకు కాలం చెల్లిందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సినిమా వచ్చి చాలా కాలం కావడంతో, ఆయన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’పై కూడా పలు అనుమానాలు రేగాయి. అయితే ఇలాంటి వార్తలన్నింటికీ చెక్ పెడుతూ షారుక్ ‘పఠాన్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

Pathaan: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో తూఫాన్ సృష్టిస్తోన్న ‘పఠాన్’

Pathaan Mind Blowing Collections On Second Day At Box-Office

Pathaan: బాలీవుడ్‌లో గతకొంత కాలంగా ఖాన్ త్రయంల సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, ఇక ఖాన్‌ల సినిమాలకు కాలం చెల్లిందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సినిమా వచ్చి చాలా కాలం కావడంతో, ఆయన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’పై కూడా పలు అనుమానాలు రేగాయి. అయితే ఇలాంటి వార్తలన్నింటికీ చెక్ పెడుతూ షారుక్ ‘పఠాన్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

పఠాన్ సినిమా రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇక రిలీజ్ రోజున ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టగా, నాన్-హాలీడే రోజైన జనవరి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.106 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అందరికీ షాకిచ్చింది. ఇక రెండో రోజున కూడా పఠాన్ తన దూకుడును ఏమాత్రం తగ్గించలేదు. సెలవు రోజైన జనవరి 26న ఈ మూవీ కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టి తొలిరోజు కంటే ఎక్కువ ఫిగర్స్‌ను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

రెండో రోజున పఠాన్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.113.60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ ఎక్స్‌పర్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నాడు. రెండు రోజులకు వరల్డ్‌వైడ్‌గా పఠాన్ తూఫాన్ క్రియేట్ చేస్తూ ఏకంగా రూ.219.60 కోట్ల మేర వసూళ్లు రాబట్టిందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇక వీకెండ్ కూడా వస్తుండటంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీపికా పదుకొనే, జాన్ అబ్రహాం ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసింది.