Pavan Kalyan Padala
Pavan Kalyan Padala : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్ దశకు చేరుకుంది. రేపు ఆదివారమే బిగ్ బాస్ ఫైనల్ జరగనుంది. టాప్ 5లో తనూజ, పవన్ కళ్యాణ్ పడాల, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన ఉన్నారు. ఈ అయిదుగురిలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 గెలుస్తారో అని బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ నుంచి షాకింగ్ విషయం లీక్ అయింది అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Pavan Kalyan Padala)
ఇటీవల జరిగిన ఓ టాస్క్ లో పవన్ కళ్యాణ్ పడాల తలకు గాయం అయిందట. అది తాజాగా బయటపడి ఎక్కువవడంతో పవన్ కళ్యాణ్ మెడికల్ రూమ్ కి వెళ్లాడని సమాచారం. పవన్ కళ్యాణ్ తలకు బలంగానే గాయం అయిందని, ప్రస్తుతం నొప్పితో బాధపడుతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఫైనల్ లో ఉంటాడా? హెల్త్ ఇష్యూస్ తో వెళిపోతాడా అని పలువురు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ నిన్నటి ఎపిసోడ్ లో, ఇవాళ రిలీజ్ చేసిన ప్రోమోలో బాగానే ఉన్నాడు. ఫుల్ యాక్టివ్ గానే ఉన్నాడు. ఇటీవల కాలంలో తలకు గాయం అయ్యేంత రేంజ్ లో టాస్క్ లు ఇవ్వలేదు. వేరే కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఇదంతా సింపతీ కోసం అని, ప్రమోషనల్ స్టంట్ అని అంటున్నారు. ప్రస్తుతం తనూజ టాప్ లో ఉంది.
పవన్ కళ్యాణ్ పడాల సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు ఓటింగ్ ప్రకారం. ఫైనల్ వరకు పవన్ టాప్ ప్లేస్ కి వెళ్ళాలి అని, సోల్జర్ అనే సింపతీ తో పాటు ఈ తలకు గాయం సింపతీ కూడా కలిసి రావాలని చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా ప్రచారం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నిన్నటి ఎపిసోడ్ , ప్రోమోలలో కూడా పవన్ కళ్యాణ్ బాగానే ఉండటంతో ఇదంతా ప్రమోషనల్ స్టంట్ అనే అంటున్నారు. రేపు జరిగే ఫైనల్ లో పవన్ కళ్యాణ్ ఉంటాడా? గెలుస్తాడా చూడాలి మరి.
Also Read : Bigg Boss 9 Telugu : రేపే బిగ్ బాస్ ఫైనల్.. ప్రభాస్ – చిరంజీవి ఫైనల్ గెస్ట్ ఎవరు..? ఫ్యాన్స్ గెట్ రెడీ..