Pawan Kalyan answer to Balakrishna offer for Joining Telugudesham Party
Pawan Kalyan : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.
బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు?
ఈ ఎపిసోడ్ లో పవన్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడో చెప్పాడు. అది విన్న బాలయ్య ఎన్టీఆర్ గురించి, తన తెలుగుదేశం పార్టీ గురించి గొప్పగా చెప్పి తెలుగు దేశంలో జాయిన్ అవ్వొచ్చుగా, ఎందుకు పార్టీ పెట్టావు అని అడిగారు. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ.. ప్రజాస్వామ్యంలో అధికారం అందరికి అందాలి. పాలిటిక్స్ లో ఆధిపత్య ధోరణి ఎక్కువుంది. కింద వాళ్లకి సంక్షేమ పథకాలు అందినా అధికారం అందట్లేదు. లోహియా, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ గారి ప్రభావం నా మీద ఎక్కువగా ఉంది. అన్నయ్య తర్వాత కాంగ్రెస్ కి వెళ్లినా నేను మాత్రం వెళ్ళలేదు. ఏ పార్టీలు మాట్లాడినా సంక్షేమ పథకాలు మాత్రమే మాట్లాడతాయి. అవే ఇస్తాం అంటారు. కానీ అవి ప్రజలు ఎదగడానికి తోడ్పడవు. నెక్స్ట్ ట్యాలెంట్ జనరేషన్ కి ఎవరూ సపోర్ట్ చెయ్యట్లేదు. ఇక్కడి నుంచి అందరూ అమెరికా, విదేశాలకు వెళ్లి అక్కడ బతికేస్తున్నారు. వేరే పార్టీల్లో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్లకు ఉంటాయి. నేను వెళ్లి ఏ పార్టీలో జాయిన్ అయినా అక్కడ నా ప్రభావం ఉండకపోవచ్చు. నా సిద్ధాంతాలు వాళ్లకు నచ్చకపోవచ్చు. అలాగే అన్ని పార్టీలు అధికారం కోసమే వస్తాయి. కానీ నేను అలా కాదు గెలవకపోయినా, ఓడినా ప్రజల కోసం ఉంటాను అని తెలిపాడు.