Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు?

ఎపిసోడ్ మొదటి పార్ట్ లో సినిమాలు, ఫ్యామిలీ గురించి మాట్లాడిన బాలయ్య ఈ పార్ట్ లో చాలా వరకు పాలిటిక్స్ గురించే మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ని అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు బాలయ్య. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ................

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు?

why pawan kalyan came into politics said by pawan kalyan in Unstoppable show

Updated On : February 10, 2023 / 11:27 AM IST

Pawan Kalyan :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.

బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Pawan Kalyan : పోలీసుల మీద చెయ్యి వెయ్యకూడదు.. ఇప్పటం ఇష్యూ గురించి చెప్పిన పవన్

ఎపిసోడ్ మొదటి పార్ట్ లో సినిమాలు, ఫ్యామిలీ గురించి మాట్లాడిన బాలయ్య ఈ పార్ట్ లో చాలా వరకు పాలిటిక్స్ గురించే మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ని అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు బాలయ్య. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ.. తమ్ముడు సినిమా 100 డేస్ ఫంక్షన్ తర్వాత ఒకసారి ఎందుకో నల్గొండకి వెళ్ళాను. అక్కడ గ్రామాల్లో ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉంది. అప్పుడు ఒక గ్రామం తీసుకొని మంచి చేద్దాం అనుకున్నా. అందుకోసం కొంతమందిని అక్కడికి పంపించి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని దానిపై రీసెర్చ్ చేసి రమ్మన్నాను. కానీ అక్కడి లోకల్ పొలిటికల్ నేతలు కొంతమంది చెయ్యనివ్వలేదు. ఇలా చాలా సార్లు జరిగింది. సరే ఒక NGO పెట్టి చేద్దాం అనుకున్నా. అలా కూడా వర్కౌట్ అయ్యేలా అనిపించలేదు. ఇంకా ఏదన్నా పెద్దగా చేయాలనుకున్నాను. అప్పుడే పార్టీ పెడదాము అనే ఆలోచన వచ్చింది. అదే టైంలో మోడీ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత అలా పార్టీ పెట్టాను. చాలా మంది ఫిలిం స్టార్స్ ఈ సినిమా స్టార్ డమ్ రాజకీయాల్లో కూడా పనికొస్తుందనుకుంటారు. కాని అది అన్ని సార్లు జరగదు. ఎన్టీఆర్, MGR గారికి జరిగింది. పార్టీ కరెక్ట్ గా నిర్మాణం అవ్వాలి అంటే కనీసం 2 దశాబ్దాలు పడుతుంది. కింద నుంచి అన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఇంకా నేర్చుకుంటున్నాను అని తెలిపారు.