Pawan Kalyan Appreciated Niharika for Helping Flood Effected Villages
Pawan Kalyan – Niharika : ఇటీవల ఏపీ, తెలంగాణలో వచ్చిన వరదలకు అనేకమంది సినీ సెలబ్రిటీలు వరద బాధితుల కోసం రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు భారీ విరాళం ఇచ్చారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలిలో అందరూ కలిపి ఆల్మోస్ట్ 10 కోట్ల వరకు భారీగా విరాళం ఇచ్చారు. మెగా డాటర్ నిహారిక కూడా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బుడమేరు వల్ల ముంపుకు గురైన పది గ్రామాలకు 50 వేలు చొప్పున అయిదు లక్షలు విరాళం ప్రకటించింది. ఈ విషయం నిహారిక తన సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.
ఏపీ వరద బాధితుల కోసం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు ప్రకటించిన సినీ పరిశ్రమలోని ప్రముఖులందరికి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం ట్విట్టర్ అకౌంట్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నిహారికకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేసారు.
Also Read : Aswathama Ganesh Idol : కల్కి సెట్టు.. ‘అశ్వత్థామ’ వినాయకుడు.. అది కూడా తమిళనాడులో..
ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఒక్కొక్క గ్రామానికి 50 వేల రూపాయల చొప్పున 10 గ్రామాలకు రూ. 5 లక్షల విరాళం ప్రకటించిన అన్నయ్య నాగబాబు గారి కుమార్తె, కొణిదెల నిహారికకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి సంకల్పంతో సాయం చేసేందుకు ముందుకు రావడం సంతోషాన్నిచ్చింది. ఇటీవలే పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాతో నిర్మాతగా విజయం సాధించిన నిహారిక మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అని ఏపీ డిప్యూటీ సీఎం ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఒక్కొక్క గ్రామానికి 50 వేల రూపాయల చొప్పున 10 గ్రామాలకు రూ. 5 లక్షల విరాళం ప్రకటించిన అన్నయ్య @NagababuOffl గారి కుమార్తె, కొణిదెల నిహారికకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 9, 2024