×
Ad

Pawan Kalyan : ఉస్తాద్ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్.. ఫుల్ స్వింగ్‌లో..!

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఫుల్ సింగ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సెట్స్‌లో..

  • Published On : September 27, 2023 / 08:25 PM IST

Pawan Kalyan at Ustaad Bhagat Singh sets photos gone viral

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) షూటింగ్ ని చాలా గ్యాప్ తరువాత పట్టాలు ఎక్కించాడు. హరీష్ శంకర్ దర్శత్వంలో రాబోతున్న ఈ మూవీ అప్పుడెప్పుడో మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఆ తరువాత ఈ మూవీని పవన్ పక్కన పెట్టి బ్రో, OG షూటింగ్స్ లో బిజీ అయ్యాడు. ఇక ఇటీవలే మళ్ళీ ఉస్తాద్ కి డేట్స్ ఇచ్చి షూటింగ్ మొదలు పెట్టాడో లేదో.. ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెరగడం, పవన్ అటు వెళ్లడం జరిగింది. దీంతో ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి.

Maama Mascheendra : ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుధీర్ బాబు స్టైలిష్ లుక్స్..

ఆ తరువాత పవన్ మళ్ళీ ఉస్తాద్ సెట్స్ లోకి వెళ్లాడా..? లేదా..? అనే దానిపై క్లారిటీ లేదు. ఇక తాజాగా వారాహి నాలుగో విడత టూర్ కూడా కన్ఫార్మ్ అయ్యిందని వార్తలు వచ్చాయి. దీంతో ఉస్తాద్ షూటింగ్ మళ్ళీ పోస్టుపోన్ అయ్యినట్లే అని అనుకున్నారంతా. అయితే తాజాగా జనసేన ట్విట్టర్ చేసిన ఒక పోస్టుతో ఉస్తాద్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుందని అర్ధమవుతుంది. ప్రముఖ స్టంట్ మేన్ బద్రి జనసేనకు రూ. 50 వేల రూపాయిలు విరాళం ఇచ్చారు. ఈ చెక్ ని పవన్ కి అందిస్తున్న వీడియో ని జనసేన పార్టీ షేర్ చేసింది.

Sunny Leone : తెలుగు మీడియం ఐ స్కూల్ స్టార్ట్ చేస్తున్న సన్నీ లియోన్..

ఆ వీడియోలో పవన్ పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. అంటే పవన్ ఉస్తాద్ మూవీ షూటింగ్ లోనే ఉన్నాడని తెలుస్తుంది. దీంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. కాగా స్టంట్ మెన్ బద్రి.. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలుసుకొని చిరంజీవి భోళాశంకర్ చిత్రంలో చేసిన స్టంట్స్ కి గాను తాను అందుకున్న పారితోషకాన్ని విరాళంగా అందజేశాడు. పవన్ కళ్యాణ్ అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. బద్రితో తనకి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. తను విశాఖలో నటనలో శిక్షణ తీసుకుంటునప్పుడే బద్రితో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నాడు.