Pawan Kalyan Birth Day : రేపు సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఫ్యాన్స్, జనసేన సైనికులు తమ నాయకుడి బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవ్వగా త్వరలో OG రిలీజ్ కాబోతుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతుంది.(Pawan Kalyan Birth Day)
రేపు పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు ముందే అంటే ఇవాళే సాయంత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తారని సమాచారం. మూవీ యూనిట్ ఫుల్ మీల్స్ ఇస్తామని ప్రకటించింది. దీంతో పోస్టర్ లేదా గ్లింప్స్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి హరీష్ శంకర్ ఫ్యాన్స్ ని మెప్పించడానికి ఏం ప్లాన్ చేసాడో చూడాలి.
Also See : Sena tho Senani : సేనతో సేనాని.. వైజాగ్ జనసేన భారీ బహిరంగ సభ.. ఫొటోలు..
ఇక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న OG సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఇటీవల పవన్ పుట్టిన రోజు నాడు ట్రైలర్ రిలీజ్ చేస్తారేమో అని రూమర్ వచ్చింది కానీ అందులో నిజం లేదు. తాజా సమాచారం ప్రకారం OG నుంచి ఓ గ్లింప్స్ తో పాటు ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 25 రిలీజ్ కానుంది.
ఈ రెండు సినిమాలే పవన్ కి లాస్ట్ అని అంతా భావిస్తున్నారు. అయితే పవన్ కి సంపాదన కేవలం సినిమాలే కాబట్టి ఇంకా సినిమాలు చేస్తారని టాక్. గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా ప్రకటించారు. నిర్మాత పవన్ డేట్స్ ఇస్తే ఆ సినిమా చేస్తాం అని తెలిపారు. దీంతో రేపు పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమా ఉన్నట్టు క్లారిటీతో అనౌన్స్ చేస్తారని సమాచారం. మరి ఇవి కాకుండా ఇంకేమైనా అప్డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ ని సంతోషపరుస్తారేమో చూడాలి.
Also Read : Pawan Kalyan : అల్లు అర్జున్ ని పరామర్శించిన పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..