Pawan Kalyan Birthday Gabbar Singh Re Releases Fans Enjoying at Theaters
Pawan Kalyan – Gabbar Singh : సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు సందడి చేయడానికి రెడీ అయ్యారు. పవన్ జనసేన ఎన్నికల్లో గెలవడం, ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి అవ్వడంతో ఈసారి ఫ్యాన్స్ హంగామా మరింత ఎక్కువగా ఉండబోతుంది. పవన్ పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోడానికి అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ సారి పవన్ పుట్టిన రోజుకి గబ్బర్ సింగ్ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.
అయితే పవన్ పుట్టిన రోజుకి ఇంకా నాలుగు రోజులు సమయం ఉన్నా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ తో ఇప్పట్నుంచే థియేటర్స్ వద్ద సందడి మొదలైంది. సాధారణంగా కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకు, రీ రిలీజ్ సినిమాలకు సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ వద్ద బ్యానర్స్, కటౌట్స్ పెట్టి ఫ్యాన్స్ హంగామా చేస్తారని తెలిసిందే. కానీ ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాకు మల్టీప్లెక్స్ వద్ద కూడా హంగామా చేస్తున్నారు.
హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ ప్రసాద్స్ థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కటౌట్ పెట్టి పేపర్లు ఎగరేస్తూ, బాణాసంచా కాలుస్తూ, పవన్ కటౌట్ కి పాలాభిషేకం చేస్తూ హంగామా చేస్తున్నారు అభిమానులు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఒక మల్టీప్లెక్స్ థియేటర్ వద్ద ఈ రేంజ్ లో సెలబ్రేషన్స్, అది కూడా రీ రిలీజ్ సినిమాకి ఇంతలా హడావిడి చేస్తున్నారు అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర 40 అడుగుల కటౌట్ పెట్టడం ఇదే మొదటిసారి, అది కూడా పవన్ కళ్యాణ్ కటౌట్ కావడం గమనార్హం. ఎంతైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే హంగామా వేరే లెవల్ అని అంటున్నారు. మరి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ఏ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
The first ever 40ft cutout in the history of @PrasadsCinemas …. ???
Trend setters for a reason ra memu ….
Anna ki Salaam kotti pakkaki mingeyyandi…#GabbarSingh4k pic.twitter.com/CX03v58Ci2
— Karthik (@Karthik_tonu) August 28, 2024