Sitara – Mahesh : నాన్న ఆ సమయంలో ఆల్మోస్ట్ ఏడ్చేశాడు.. అమ్మ చాలా స్ట్రిక్ట్.. సితార ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా సితార ఘట్టమనేని ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.

Sitara – Mahesh : నాన్న ఆ సమయంలో ఆల్మోస్ట్ ఏడ్చేశాడు.. అమ్మ చాలా స్ట్రిక్ట్.. సితార ఆసక్తికర వ్యాఖ్యలు..

Sitara Ghattamaneni said her Father Mahesh Babu Cried in that Time

Updated On : August 28, 2024 / 5:02 PM IST

Sitara – Mahesh : మహేష్ కూతురు సితార ఇప్పటికే యాడ్స్, సేవా కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది. తాజాగా సితార ఘట్టమనేని ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.

తన ఫస్ట్ యాడ్ PMJ జ్యువెల్లర్స్ కి చేసిన సంగతి తెలిసిందే. ఆ యాడ్ బాగా వైరల్ కూడా అయింది. అయితే ఆ యాడ్ చూసినప్పుడు మహేష్ ఎలా స్పందించాడో సితార తెలిపింది. సితార మాట్లాడుతూ.. నాన్న నా ఫస్ట్ యాడ్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు బాగా గుర్తుంది నాన్న నా యాడ్ చూసి ఆల్మోస్ట్ ఏడ్చేశారు. అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని తెలిపింది.

Also Read : Mahesh – Gautam : మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఏం చదువుతున్నాడో తెలుసా? హీరో అవ్వడానికి..

అలాగే.. ఇంట్లో అమ్మ చాలా స్ట్రిక్ట్. నాన్న నన్ను గారాబం చేస్తారు. నేను స్కూల్ బంక్ కొట్టేది మా నాన్న వల్లే. మా నాన్నకి వర్క్ లేనప్పుడు నన్ను స్కూల్ కి వెళ్లొద్దు అంటారు. నన్ను స్కూల్ కి పంపించొద్దు అని మా అమ్మతో గొడవ పడతాడు. అప్పుడు నాతో సమయం గడుపుతారు అని తెలిపింది.