Mahesh – Gautam : మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఏం చదువుతున్నాడో తెలుసా? హీరో అవ్వడానికి..

మహేష్ తనయుడు విదేశాల్లో చదవడానికి వెళ్లాడని తెలిసిందే.

Mahesh – Gautam : మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఏం చదువుతున్నాడో తెలుసా? హీరో అవ్వడానికి..

Sitara tells about Gautam Ghattamaneni Study and hints he will become Hero

Updated On : August 28, 2024 / 3:13 PM IST

Mahesh – Gautam : మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని, కూతురు సితార ఇద్దరూ కూడా సినిమాల్లోకి వస్తారని గతంలోనే మహేష్ తెలిపాడు. దీంతో అభిమానులు ఈ ఇద్దరి సినిమా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. గౌతమ్ ఇప్పటికే వన్ – నేనొక్కడ్నే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు. ఇక సితార ఓ సాంగ్, యాడ్స్ చేసి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులని అలరిస్తుంది.

Also Read : Mahesh – Sitara : మహేష్ సినిమాల్లో సితార ఫేవరేట్ సినిమా ఏదో తెలుసా? అది ఐకానిక్ క్యారెక్టర్ అంటూ..

అయితే మహేష్ తనయుడు విదేశాల్లో చదవడానికి వెళ్లాడని తెలిసిందే. తాజాగా సితార ఘట్టమనేని ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అన్నయ్య గౌతమ్ గురించి మాట్లాడుతూ.. అన్నయ్య కూడా యాక్టర్ అవుతాడు. ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలో నాలుగేళ్ల డ్రామా కోర్స్ చేస్తున్నాడు అని తెలిపింది. దీంతో గౌతమ్ హీరో అవ్వడానికి యాక్టింగ్ లో కోర్స్ చేస్తున్నాడని అర్ధమవుతుంది. నాలుగేళ్ల కోర్స్ తర్వాత గౌతమ్ ని హీరోగా మహేష్ ఇంట్రడ్యూస్ చేస్తాడా చూడాలి. అయితే గౌతమ్ లండన్ లోని న్యూయార్క్ యూనివర్సిటీ బ్రాంచ్ లో కోర్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల రెగ్యులర్ గా మహేష్ ఫ్యామిలీ లండన్ వెళ్లడం, అక్కడి కాలేజీలో గౌతమ్ నాటకం వేయడంతో గౌతమ్ లండన్ లోనే చదువుతున్నట్టు తెలుస్తుంది.