Mahesh – Sitara : మహేష్ సినిమాల్లో సితార ఫేవరేట్ సినిమా ఏదో తెలుసా? అది ఐకానిక్ క్యారెక్టర్ అంటూ..
తాజాగా సితార ఇచ్చిన ఇంటర్వ్యూలో బోలెడన్ని విషయాలు చెప్పగా తన తండ్రి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా గురించి అడగడంతో..

Sitara Ghattamaneni Talks about her Favorite Mashesh Babu Movie
Mahesh – Sitara : మహేష్ బాబు కూతురు సితార కూడా సోషల్ మీడియాలో బాగా ఫేమస్. చిన్నప్పట్నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తండ్రిలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ పాపులర్ అవుతుంది. ఆల్రెడీ నటన కూడా మొదలుపెట్టేసింది. సితార ఫ్యూచర్ లో కచ్చితంగా సినిమాల్లోకి వస్తుంది అని ఆల్రెడీ మహేష్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు సితార ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది.
Also Read : Nani : యాంకర్ అడిగిన ప్రశ్నకి.. ఆ సినిమా క్యారెక్టర్‌తో యాంకర్‌ని ఆడేసుకున్న నాని..
తాజాగా సితార ఇచ్చిన ఇంటర్వ్యూలో బోలెడన్ని విషయాలు చెప్పగా తన తండ్రి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా గురించి అడగడంతో సితార మాట్లాడుతూ.. ఖలేజా సినిమా అంటే చాలా ఇష్టం. ఎప్పటికి బెస్ట్ మూవీ అది. సినిమాలో రాజు.. సీతారామరాజు ఒక ఐకానిక్ క్యారెక్టర్ అని చెప్పింది. ఖలేజా సినిమా అంటే మహేష్ అభిమానులకు కూడా చాలా ఇష్టమైన సినిమా. రిలీజయినప్పుడు కమర్షియల్ గా సినిమా యావరేజ్ గా నిలిచినప్పటికీ ఇప్పటికి ఈ సినిమా గురించి అందరూ మాట్లాడతారు. విమర్శకులని సైతం ఖలేజా సినిమా మెప్పించింది.
Raju “ SITA RAMA RAJU ” ?#Khaleja pic.twitter.com/VIlyyx2rO0
— ఒక్కడు (@_urstrulybharat) August 27, 2024