Nani : యాంకర్ అడిగిన ప్రశ్నకి.. ఆ సినిమా క్యారెక్టర్‌తో యాంకర్‌ని ఆడేసుకున్న నాని..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని యాంకర్ ని సరదాగా ఆటపట్టించాడు.

Nani Fun with Anchor in Saripodhaa Sanivaaram Promotions
Nani : న్యాచురల్ స్టార్ నాని రేపు ఆగస్టు 29న సరిపోదా శనివారం సినిమాతో రాబోతున్నాడు. సరిపోదా శనివారం సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో నాని ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని యాంకర్ ని సరదాగా ఆటపట్టించాడు.
ఇంటర్వ్యూలో యాంకర్ నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాకు సీక్వెల్ ఉందా అని అడగ్గా.. నాని వెంటనే ఆ సినిమా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి క్వశ్చన్ మర్చిపోయినట్టు నటించి మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్నని యాంకర్ తో అడిగించాడు. చాలా సేపటికి గాని యాంకర్ ని నాని యాక్ట్ చేస్తున్నాడని అర్ధం కాలేదు.
భలే భలే మగాడివోయ్ సినిమాలో నాని మతిమరుపు ఉన్న క్యారెక్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యాంకర్ ఆ సినిమా గురించి అడగ్గానే వెంటనే ఆ క్యారెక్టర్ లోకి వెళ్లి నాని నటిస్తూ మాట్లాడటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి నాని భలే రియాక్ట్ అయ్యాడు అంటూ నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు.
#Nani act to forget question like he forget in BBM
Anchor doesn't catch it ??Natural star for a reason ?? pic.twitter.com/RfP5iavrfm
— Nawwni ˢᵃʳⁱᵖᵒᵈʰᵃᵃ ˢᵃⁿⁱᵛᵃᵃʳᵃᵐ ? (@__Ayush__14) August 27, 2024