Rao Ramesh – Pushpa : పుష్ప 1లో ఇంతే మీ పాత్ర అని చెప్పి డేట్స్ పార్ట్ 2కి తీసుకున్నారు.. పుష్ప 3లో కూడా ఉండొచ్చేమో..
తాజాగా పుష్ప సినిమాలో తన పాత్ర పై, పుష్ప పార్ట్ 3 పై నటుడు రావు రమేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Rao Ramesh Talks about his Character in Pushpa Movie and Pushpa Part 3
Rao Ramesh – Pushpa : అల్లు అర్జున్ పుష్ప సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప పార్ట్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ అభిమానులు, పాన్ ఇండియా ప్రేక్షకులు పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప పార్ట్ 3 కూడా ఉందని ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. ఇండైరెక్ట్ గా సుకుమార్ కూడా పార్ట్ 3 ఉంటుందని అన్నాడు.
Also Read : Chiranjeevi – Allu Ramalingaiah : చిరంజీవి పూజా మందిరంలో.. నాన్న, మామయ్య అల్లు రామలింగయ్య ఫోటోలు..
తాజాగా పుష్ప సినిమాలో తన పాత్ర పై, పుష్ప పార్ట్ 3 పై నటుడు రావు రమేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రావు రమేష్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు కథ అంతా చెప్పి ఒక్క సీన్ మాత్రమే షూట్ చేసి మిగిలిన డేట్స్ పుష్ప 2కి వాడుకుంటాం సర్ అన్నారు. నేను ఓకే అన్నాను. పార్ట్ 2లో మాత్రం మంచి పాత్రే పడింది. చాలా డేస్ వర్క్ చేశాను. ఇప్పుడు పార్ట్ 3 అంటున్నారు. పార్ట్ 3లో కూడా నా పాత్ర ఉండొచ్చేమో అని కామెంట్స్ చేసారు. దీంతో పుష్ప పార్ట్ 3 కూడా ఉందని మరోసారి క్లారిటీ వచ్చింది. పుష్ప సినిమాలో సిద్ధప్ప అనే రాజకీయ నాయకుడి పాత్రలో రావు రమేష్ కాసేపే కనపడ్డారు. పార్ట్ 2లో ఈ పాత్ర ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తుంది.
Pushpa 3 fix aithe ? pic.twitter.com/XEBcf5TaRw
— Phoebe (@Nasavnensasthaa) August 27, 2024