pawan kalyan
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజక వర్గంలో కేంద్రం సహకారంతో జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా 1290 కోట్ల విలువైన తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సభకు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీ, లోకల్ నాయకులు హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకును. మా నాన్నగారి ఉద్యోగ రీత్యా ప్రకాశం, నెల్లూరు సహా ఐదారు జిల్లాల్లో తిరిగాము. నేను నెల్లూరులో ఉన్నప్పుడు టెన్త్ పూర్తయ్యాక VR కాలేజీలో ఇంటర్ సీట్ కోసం నా కజిన్ ద్వారా దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి గారు సహాయం చేసారు. అప్పుడు విద్యార్ధి నాయకులుగా ఉండేవారు. వారికి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు సభా ముఖంగా చెప్పుకుంటున్నాను అని తెలిపారు.
Also Read : Prabhas – Fish Venkat : ప్రభాస్ మాకు హెల్ప్ చేయలేదు.. అది ఫేక్ వార్త.. ఫిష్ వెంకట్ కూతురు క్లారిటీ..
ఈ సభకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా హాజరయ్యారు. ఆయన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి గురిస్తూ ప్రస్తావిస్తూ గతంలో చేసిన సాయానికి ఇలా ధన్యవాదాలు తెలిపారు పవన్.