Prabhas – Fish Venkat : ప్రభాస్ మాకు హెల్ప్ చేయలేదు.. అది ఫేక్ వార్త.. ఫిష్ వెంకట్ కూతురు క్లారిటీ..

తాజాగా నేడు ఫిష్ వెంకట్ కూతురు ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.

Prabhas – Fish Venkat : ప్రభాస్ మాకు హెల్ప్ చేయలేదు.. అది ఫేక్ వార్త.. ఫిష్ వెంకట్ కూతురు క్లారిటీ..

Prabhas

Updated On : July 5, 2025 / 2:50 PM IST

Prabhas – Fish Venkat : సీనియర్ నటుడు ఫిష్ వెంకట్ గత కొన్నాళ్ల నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో పలువురు ఆయనకు హెల్ప్ చేసారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్ ఆరోగ్యం బాగా క్షీణించి, రెండు కిడ్నీలు పడాయి హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్నారు. ఫిష్ వెంకట్ హాస్పిటల్ వెంటిలేటర్ పై ఉన్న ఫోటోలు, వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి.

అయితే రెండు రోజుల నుంచి ఫిష్ వెంకట్ కి ప్రభాస్ 50 లక్షలు సాయం చేస్తానని చెప్పినట్టు, సాయం చేసాడని వార్తలు వచ్చాయి. తాజాగా నేడు ఫిష్ వెంకట్ కూతురు ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.

Also Read : Lopaliki Ra Chepta : ‘లోపలికి రా చెప్తా’ మూవీ రివ్యూ.. ఢీ కంటెస్టెంట్ అనాల సుస్మిత నటించిన రొమాంటిక్ థ్రిల్లర్..

ఈ వీడియోలో ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి మాట్లాడుతూ.. ప్రభాస్ సాయం చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ప్రభాస్ పీఏ అని ఒకరు కాల్ చేశారు. వివరాలు తెలుసుకొని సాయం చేస్తా అన్నారు కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సాయం అందలేదు. తమకు వచ్చిన నెంబర్ కు కాల్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయడం లేదు. ఇలా ఫేక్ కాల్స్ తో కాలయాపన చేసే సమయం కాదు, మా నాన్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుంది. ఇండస్ట్రీ నుంచి మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు, ఇలాంటి ఫేక్ వార్తలు చెప్పి ఇచ్చేవాళ్లను కూడా ఇవ్వనివ్వకుండా చేయకండి. సాయం చేసేవాళ్లు ఎవరైనా సాయం చేయండి అంటూ వేడుకున్నారు. మరి దీనిపై ప్రభాస్ టీమ్ స్పందిస్తుందా చూడాలి.