×
Ad

Pawan kalyan : మొదటిసారి ఫ్యాన్ వార్స్ పై స్పందించిన పవన్ కళ్యాణ్.. అందరి అభిమానులకు నా రిక్వెస్ట్ అంటూ..

OG సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి మాట్లాడుతూ ఫ్యాన్ వార్స్ గురించి కూడా మాట్లాడారు.

Pawan kalyan

Pawan kalyan : ఇటీవల సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎంతగా పెరిగిపోయాయి అందరికి తెలిసిందే. కొంతమంది ఖాళీగా ఉన్న అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియాలో కొట్టుకుంటూ అవతలి హీరో సినిమాలని దెబ్బతీస్తూ తమ హీరోల సినిమాలకు నష్టం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది ఈ ఫ్యాన్ వార్స్ ని మరింత పెంచుతున్నారు.(Pawan kalyan)

ఎన్టీఆర్, మహేష్, చరణ్.. లాంటి పలువురు స్టార్ హీరోలు మేము మేము బాగానే ఉంటాము అని చెప్పినా ఫ్యాన్స్ మాత్రం వినకుండా కొట్టుకుంటున్నారు. మొదటిసారి పవన్ కళ్యాణ్ ఈ ఫ్యాన్ వార్స్ పై స్పందించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా OG సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి మాట్లాడుతూ ఫ్యాన్ వార్స్ గురించి కూడా మాట్లాడారు.

Also See : OG Success Meet : ఘనంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సక్సెస్ మీట్.. ఫొటోలు..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అందరి హీరోల అభిమానులకు చెప్తున్నా నేను అందరి హీరోలను అభిమానిస్తాను. ఎన్టీఆర్, ప్రభాస్, రామ చరణ్, చిరంజీవి గారు, నాని.. అందర్నీ అభిమానిస్తాను. వాళ్ళ వర్క్ ని గౌరవిస్తాను. నేను ఆర్ట్ ని ప్రేమించేవాడిని. ఒక వ్యక్తి ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడు అంటే మన మనసు సరిగ్గా లేదని అర్ధం. అందరి అభిమానులకు, నా అభిమానులతో కలిపి చెప్తున్నాను ఈ ఫ్యాన్ వార్స్ చేయడం ఆపండి. మేము అందరం కష్టపడి పనిచేస్తాము. పగలు రాత్రి లేకుండా, ఇంటికి వెళ్లకుండా పనిచేస్తాము. ఈ ఫ్యాన్ వార్స్ లో సినిమాని చంపకండి. ఒకప్పుడు వంద రోజులు ఆడేవి సినిమాలు. కానీ ఇప్పుడు వారానికి పడిపోయింది సినిమా. ఒకర్నొకరు అభినందించుకోండి. అంతేగాని ఇలా ఉండకూడదు అలా చేయకూడదు అని తిట్టుకుంటూ ఉంటే సమాజంలో అగ్లీ నెస్ పెరిగిపోతుంది. ఇది ఎవరికీ మంచిది కాదు అందరికి నా రిక్వెస్ట్ ఇది. మీరెంత మారతారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను మాత్రం అందరి హీరోల అభిమానులను అభిమానిస్తున్నాను అని అన్నారు.

దీంతో పవన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. ఇటీవల ఫ్యాన్ వార్స్ వల్ల గేమ్ ఛేంజర్, దేవర, హరిహర వీరమల్లు.. లాంటి పలు సినిమాలు ఎఫెక్ట్ అయ్యాయి. కొంతమంది పనిగట్టుకొని మరీ వేరే హీరోల సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా హీరోల అభిమానులు ఈ ఫ్యాన్ వార్స్ ఆపేసి అందరూ ఒకటే, అందరూ సినిమాల కోసమే పనిచేస్తారు అని అర్ధం చేసుకుంటారా చూడాలి.

Also See : Pawan Kalyan : OG సక్సెస్ మీట్.. పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్.. ఇక్కడ చూసేయండి..