Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నా చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని కుదిరినప్పుడల్లా డేట్స్ ఇస్తూ సినిమాలు పూర్తిచేస్తున్నాడు. ఇటీవలే OG సినిమా షూటింగ్ పూర్తి చేయగా త్వరలో ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక పవన్ చేతిలో మిగిలిన ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ ప్రస్తుతం జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.(Pawan Kalyan)
నేటితో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ పూర్తయినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి గ్రాండ్ ఫేర్ వెల్ ఇచ్చారు మూవీ యూనిట్. టీమ్ అంతా పవన్ ని తీసుకొచ్చి స్పెషల్ ఫొటో దిగారు. పేపర్ బ్లాస్ట్ లు చేసారు. ఇక హరీష్ శంకర్ అయితే పవన్ చేతిని పట్టుకొని దండం పెట్టేసాడు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యూనిట్ తాజాగా ఈ వీడియో రిలీజ్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.
Also Read : The OG Boys : ‘ది OG బాయ్స్’.. పవర్ స్టార్ తో స్పెషల్ ఫొటో వైరల్.. ఇందులో పవన్ ని గమనించారా..?
పవన్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేయడంతో ఇక నెక్స్ట్ పవన్ సినిమాలపై సందిగ్దత నెలకొంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గతంలో ఓ సినిమా ప్రకటించినా అది ఉంటుందో లేదో క్లారిటీ లేదు. ప్రస్తుతం పవన్ జనసేన పార్టీ పై, ఏపీ ప్రభుత్వంపై ఫోకస్ చేస్తున్నారు. మళ్ళీ సినిమాలు చేస్తారో లేదో తెలీదు. ఇటీవల హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో పవన్ మళ్ళీ హీరోగా సినిమాలు చేస్తానో లేదో తెలీదు కానీ నిర్మాతగా అయితే సినిమాలు చేస్తాను అన్నారు.
దీంతో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లాస్ట్ సినిమా అని, ఇవాళే పవన్ లాస్ట్ డే షూట్ అని భావిస్తున్నారు. అందుకే పవన్ కి గ్రాండ్ ఫేర్ వెల్ ఇచ్చారు మూవీ యూనిట్ అని అంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.
POWER STAR @PawanKalyan wraps up his part of shoot for #UstaadBhagatSingh ❤🔥❤🔥@Pawankalyan – @harish2you combo is always a festival for cinema lovers and a cult celebration for fans 🔥
Get ready to celebrate our USTAAD at his best on the Big Screens 💥@harish2you… pic.twitter.com/X7pFa31BWL
— Mythri Movie Makers (@MythriOfficial) September 14, 2025